

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ఉప్పలగుప్తం జూలై 01:
ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గెడ్డం పల్లాలమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం సరిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ గెడ్డం స్వరూప సురేష్ బాబు ఆధ్వర్యంలో సరిపల్లి ఎంపీపీ ఎలిమెంటరీ పాఠశాల నందు మంగళవారం పల్లాలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే సత్యనారాయణమ్మ మాట్లాడుతూ… ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు గ్రహీత గెడ్డం పల్లాలమ్మ జన్మదిన వేడుకల ద్వారా ఆమె చేసిన సేవలు ఈ సందర్భంగా మరోసారి మమ్మల్ని అందరినీ ఆలోచింపచేసాయని ఆమె పల్లాలమును కొనియాడారు. విద్యార్థిని విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించిన సేవా దృక్పథం కలిగిన టీచర్ పల్లాలమ్మని పాఠశాల ఉపాధ్యాయులు గుర్తు చేశారు. పిల్లలకు నోట్ బుక్స్ పెన్నులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గెడ్డం శ్రీనివాసరావు, ఈ వెంకటేష్, జి రమేష్ బాబు, ఎం సురేష్ తదితరులు పాల్గొన్నారు