

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 01:

కోనసీమ రవాణా జేఏసి తో ఎంపీ హరీష్ బాలయోగి…
మోటారు వాహనాల పిట్నెస్ కొరకు ప్రభుత్వం నూతన విధానంలో వాహన దారులకు సమస్యలు ఉన్నాయని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రవాణా జే ఏ సీ ఇచ్చిన వినతి పత్రం మేరకే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరమైన విధానం వల్ల వాహన యజమానులకు ఇబ్బందులు కలుగుతాయని కమిటీ సభ్యులు తెలిపారన్నారు.ప్రయివేట్ ఏజెన్సీల ద్వారా కాకుండా గతంలో మాదిరిగానే రవాణా శాఖ మరియు వాహన యజమానుల ద్వారా ఈ సర్టిఫికెట్ ల ప్రక్రియ కొనసాగించాలని కోరారన్నారు. ఈ నూతన విధానాన్ని కొంతకాలం అమలు కాకుండా చూసి వాహన యజమానులకు సహకరించాలని కోరారని కావునా దీనిపై సంబంధిత అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలపడంతో పాటు వాహన యజమానుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ హరీష్ తెలిపారు.
