
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 30:
ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అధ్యక్షులు (చైర్మన్) డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ జూలై, 3, 4 తేదీలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలలో పర్యటించనున్నారని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి పెద్దిరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు . తాడేపల్లి నుండి తూర్పు గోదావరి జిల్లా చేరుకుని తూర్పు గోదావరి, మరియు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో జూలై 3,4 తేదీ లలో పర్యటించ నున్నట్లు ఆయన వెల్ల డించారు రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ గౌరవనీయ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ కుమార్ జూలై 4వ తేదీ శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోన సీమ జిల్లాలో ప్రింటు మరి యు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో పాత్రికే యుల సమావేశం నిర్వహిస్తారని ఎగ్జిక్యూటి వ్ డైరెక్టర్ డి పెద్దిరాజు ప్రకటనలో తెలిపారు.