ప్రజా ఆయుధం మార్చి 03:18 సంవత్సరాలు వయసు కంటే ఎక్కువ ఉన్న వ్యక్తి 18 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయసున్న బాలికను పెళ్ళి చేసుకుంటే అతనికి రెండు సంవత్సరాల కఠన జైలు శిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా లేదా రెండూ కలిసి విధించవచ్చు.
ఎవరైతే బాల్యవివాహాన్ని చేస్తారో వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా లేదా రెండూ కలిసి విధించవచ్చు.
ఎవరైతే బాల్యవివాహాన్ని ప్రోత్సహిస్తారో వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా లేదా రెండూ కలిసి విధించవచ్చు అయితే, ఆ స్త్రీకి ఖైదు విధించరు.