ప్రజా వేదికను సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 12:

ప్రజా వేదిక టోల్ ఫ్రీ నెంబర్ 1100 దయచేసి వినియోగించండి : ప్రజా వేదిక కలెక్టరేట్

ఈనెల 13 వ తేదీ సోమవారం స్థానిక కలెక్టరేట్ లో ఉదయం 10 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అర్జీ దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాక పోయినా, లేదా తమ ఫిర్యా దులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడా నికి 1100 నెంబర్ కు కాల్ చేయవచ్చునన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవ డానికి “మీకోసం డాట్ ఏపీ డాట్ జివోవి డాట్ ఇన్” వెబ్సైట్ నందు వారి యొక్క అర్జీలు నమోదు చేసు కోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం కోరాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈనెల 13 వ తేదీన సోమ వారం స్థానిక కలెక్టరేట్ లోనీ గోదావరి భవన్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వ హించడం జరుగుతుందని తెలిపారు. ప్రజా సమ స్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉద యం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహిం చడం జరుగుతుందని, ఈ కార్య క్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొం టారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం లో అర్జీదారులు తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబం ధించి అర్జీలను వ్రాత పూర్వకంగా అందజే యాలన్నారు సమస్య పరిష్కారమైనప్పు డు అర్జీ దారుని ఫోన్ కి మెసేజ్ వస్తుందని, అర్జీ దారులు వారి ఫోన్ ను చెక్ చేసు కోవాలన్నారు. నోటీ సులు, ఎండార్స్మెంట్ ను వాట్సాప్ లో పంపడం జరుగుతుంద న్నారు. మండల, డివిజన్, పురపాలక సంఘ స్థాయిల లో పి జి ఆర్ ఎస్ కార్యక్ర మాలు ఆ యొక్క స్థాయి సమస్యల పై యధావిధిగా కొనసాగుతాయన్నారు. అర్జీదారులు కేవలం జిల్లాస్థాయిలో సమస్యల పరిష్కారం కొరకు మాత్రమే కలెక్టరేట్ నందు నిర్వహించే పిజిఆర్ఎస్ కార్య క్రమాన్ని సద్వినియోగం చేసుకోవా లని ఆయన ప్రకటనలో విజ్ఞ ప్తి చేశారు.

Related Articles

ఆయిల్ ఇండియా లిమిటెడ్ వద్ద ఉత్తేజకరమైన కెరీర్ అవకాశాలు: 2025 నియామకానికి ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ఉద్యోగాలు జూలై 26: Exciting Career Opportunities at Oil India Limited: Apply Now for 2025 RecruitmentAbout Oil India […]

కేంద్ర ప్రభుత్వం” డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సర్వే

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 25: పెట్టుబడులకు అనుకూల మైన వాతావరణం సృష్టి చేందుకుగాను వివిధ రాష్ట్రాల మధ్య పోటీ తత్వాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ […]

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లాలో రైతుల కోసంవైయస్‌ఆర్‌సీపీ నేతలు పోరు బాట

రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ అన్నదాతలతో కలిసి కలెక్టరేట్‌కి ర్యాలీగా వైయస్‌ఆర్‌సీపీ నేతలు V9 ప్రజా ఆయుధం దినపత్రిక – అమలాపురం డిసెంబర్ 13 అన్న దాతకు అండగా…ర్యాలీలో పాల్గొన్న జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ […]

డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రెట్ కు 211 అర్జీలు

నిత్యవసర వస్తువులు రేషన్ షాప్ వాహనాలను కొనసాగించాలి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి నాయకత్వంలో ప్రజా సమస్యలు వేదికలో అమలాపురం కలెక్టరేట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. V9 ప్రజా […]