అంగన్వాడి పట్ల ఐసిడిఎస్, సిడిపివోలు ఎంఈఓలు పూర్తి సమన్వయం వహించాలి జిల్లా మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 25:

అంగన్వాడి కేంద్రాలలో పూర్వపు ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 5 సంవత్సరాలు వయసు నిండిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలలో చేరి నమోదు అయ్యే విధంగా ఐసిడిఎస్, సిడిపివోలు ఎంఈఓలు పూర్తి సమన్వయం వహించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మహేష్ కుమార్ ఆదేశించారు.

బుధవారం స్థానిక కలెక్టరేట్ నందు మహిళా శిశు సంక్షేమ శాఖ సిడిపిఓలు మరియు విద్యా శాఖకు చెందిన మండల విద్యాశాఖ అధికారులతో సంయుక్తంగా సమావేశం నిర్వహించి అంగన్వాడీ నుండి ఒకటో తరగతిలో ప్రవేశాలపై సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టా త్మకంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తోందని దీనిలో భాగంగా అంగన్వాడీల నుండి ఒకటో తరగతి లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరికి ఈ తల్లికి వందనం లబ్ధిని పొందేలా చూడాల్సిన బాధ్యత ఇరు శాఖలపై ఉందన్నారు.

ఈ కేవైసీ పెండింగ్ అంశాలపై డి ఎల్ డి వో లు ప్రత్యేక దృష్టి సారించి అర్హులైన వారికి లబ్దిని చేకూర్చాలన్నారు అంగన్వాడీల నుండి బయట కు వెళ్లేవారు ప్రీస్కూల్ నుంచి ఒకటో తరగతిలో జాయిన్ అయ్యే వారిని సమగ్రంగా గుర్తిస్తూ హేతుబద్ధంగా లబ్ధిని అందించేందుకు ఇరు శాఖలు సమగ్ర డేటాను రూపొందిస్తూ కీలక భూమిక పోషించాలని సూచించారు. అంగన్వాడీల నుండి ఫ్రీ స్కూలు నుండి బయ టకు వెళ్లినవారు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు లేదా ఇతర జిల్లాలు రాష్ట్రా లకు వెళ్లి జాయిన్ అవుతున్నారా అనే కోణంలో విశ్లేషించి సమగ్ర డేటాను రూపొందించి సమర్పిం చాలని ఆదేశించారు.

ఇప్పటివరకు రెండో తరగతి నుండి పదవ తరగతి వరకు తల్లికి వందనం నిధులు జమ అయ్యాయని. జూలై 1 నుండి ఒకటో తరగతి లో జాయిన్ అయిన వారికి తల్లికి వందనం లబ్దిని ప్రభుత్వం అందించ నుందన్నారు ఈ లోపుగా అని ప్రక్రియలు పూర్తిచేసి అర్హత పొందిన వారికి తల్లికి వందనం నిధులు జమ అయ్యేలా చూడాలని ఆయన ఆదేశించారు ఇటీవల నూతనంగా ప్రవేశపెట్టిన తొమ్మిది కేటగిరీల పాఠశాలల నిర్వహణలో తరగతి గదుల సర్దుబాటు చర్య లను డీఈఓ సమన్వయంతో చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిఇఓ షేక్ సలీం భాష, ఐసిడిఎస్ పిడి శాంతి కుమారి, సమగ్ర శిక్ష ఏపీసి జి మమ్మీ, ఉప విద్యాశాఖ అధికారులు జి సూర్య ప్రకాశం, సుబ్రహ్మణ్యం ఎంఈఓ లు సిడిపిఓలు పాల్గొన్నారు.

Related Articles

రోడ్డు ప్రమాదంలో ఆలమూరు ఎస్సై మృతి పై పోలీస్ శాఖ దిగ్బ్రాంతి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -సూర్యపేట జూన్ 26: సూర్యపేట కోదాడ సమీపంలోని ఘోర ప్రమాదం ప్రమాదంలో మరణించిన ఎస్సై కానిస్టేబుల్ పట్ల రాష్ట్ర పోలీస్ శాఖ దిగ్బ్రాంతి చెందింది. […]

డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి/ఎంపీ హరీష్ ఎమ్మెల్యే దాట్ల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – తాళ్ళు రేవు జూలై 18: హైవే అధికారులకు,యానాం మున్సిపల్ కమిషనర్ కు సూచించిన ఎంపీ హరీష్, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు డాక్టర్ బీ […]

చలో గుంటూరు మాలమహానాడు బహిరంగ సభకు వేలాదిగా పి. గన్నవరం నియోజకవర్గ కార్యకర్తలు

v9 public weapon online news V9 ప్రజా ఆయుధం ఆన్ లైన్ వార్తలు – పి.గన్నవరం డిసెంబర్ 15: వర్గీకరణకు వ్యతిరేకంగా ఆదివారం గుంటూరు జిల్లా నల్లపాడు లో ఏర్పాటుచేసిన మాల మహానాడు […]

అంబాజీపేట ఏఎంసీ డైరెక్టర్ గా ఎంపికైన మోర్త సత్తిబాబు కు అభినందనలు తెలిపిన హెచ్ఆర్డి & V9 మీడియా

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 15: అంబాజీపేట ఏఎంసీ డైరెక్టర్ హా ఎంపికైన మోర్త సత్తిబాబు కు హెచ్ఆర్డి & V9 మీడియా అభినందనలు తెలిపారు.డాక్టర్ బి […]