

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం రూరల్ 07:

అగ్ని ప్రమాదంలో తాటాకిళ్లు పూర్తిగా దగ్దమై బాధితులు కట్టుబట్టలతో మిగిలారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ అమలాపురం కామనగరువు పంచాయతీ జంగంపాలెంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో తాటాకిళ్లు పూర్తిగా దగ్దమై బాధితులు కట్టుబట్టలతో మిగిలారు.అగ్ని ప్రమాదంలో వాసంశెట్టి పెద్దిరాజు,కుంచే శాంతమ్మ కుటుంబాలు సర్వం కోల్పోయి నిరాశ్రయులు అయ్యారు.విషయం తెలుసుకున్న అమలాపురం నియోజకవర్గ వైఎస్సార్ సిపి సీనియర్ నాయకులు,గుడ్ సీడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుంచే రమణారావు అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు సాయం అందించారు.సోమవారం బాధిత కుటుంబాలకు సర్పంచ్ నక్కా అరుణకుమారి చంద్రశేఖర్ చేతులమీదుగా బియ్యం,వంట సామాగ్రి,నిత్యావసరాలు,దుస్తులను గుడ్ సీడ్ ఫౌండేషన్ సభ్యులు అందజేశారు.సాయం అందించిన రమణారావుకు బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు.మాజీ సర్పంచ్ నక్కా సంపత్ కుమార్ గ్రామ పెద్దలు చొల్లంగి శ్రీనివాస్,పెద్దింశెట్టి ప్రకాష్,కొప్పిశెట్టి వీరంశెట్టి,కుంచే మోహన్,మెండి ప్రసాద్,ఫౌండేషన్ సభ్యులు పందిరి సుబ్బరాజు,నేరేడుమిల్లి శ్రీనివాస రావు,గంటా లక్ష్మీ ప్రసాద్,కుంచే అర్జున్,పరమట రాజేష్,నెల్లి ప్రసాద్,కుంచే రాజు,పరమట మురళీ కృష్ణ,పరమట నాగరాజు, ముత్తాబత్తుల గణేష్,బల్లా చిన రాజా,విప్పర్తి రమేష్ పాల్గొన్నారు.