

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం సెప్టెంబర్ 22:

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీ పైనా ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రజల సమస్యలకు నూరు శాతం నాణ్యమైన పరిష్కార మార్గాలు చూపాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. సోమవారం స్థానిక అమలాపురం కలెక్టరేట్ నందు పీజీఆర్ఎస్ కార్యక్ర మం నిర్వహించారు.

ఈ క్రమంలో అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ నిశాంతి అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశ గడువులోగా అర్జీ దారుడు సంతృప్తి చెందేలా సమస్యను పరిష్కరించాల న్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన పీజీఆర్ఎస్ 205 అర్జీలు వచ్చేయన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు వచ్చే ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టి సారించాలని, సమస్య పరిష్కారంలో ఉదాసీనతను ఎట్టిప రిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని, ప్రజల సమస్యల పరిష్కార ప్రక్రియను నిరంతరం పర్యవేక్షి స్తోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజా మనుగడతో ముడిపడిన అర్జీలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ప్రజల సమస్యలను తమ సొంత సమస్యలుగా భావించి పరిష్కారానికి కృషిచేయాలని ఆదేశించారు. ఎండార్స్మెంట్ ఇచ్చేసి చేతులు దులుపు కుంటే సహించేది లేదని, తప్పనిసరిగా సమస్యకు సరైన విధంగా పరిష్కారం చూపాల్సిందేనని స్పష్టం చేశారు.

నిర్లక్ష్యం, ఉదాసీనతతో వ్యవహరించ కుండా ప్రభుత్వం ఆశించినట్లు ప్రజల్లో సుపరిపాలనపై విశ్వ సనీయతను పెంపొందించా లన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుడు వారి ఆర్జీలను నమోదు చేసుకొని ముందుగా సమస్యకు సంబంధించిన జిల్లా అధికారిని కలిసే విధంగా ఇప్పటివరకు నిర్వహించిన పి జి ఆర్ ఎస్. కు భిన్నంగా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారన్నారు. అర్జీదారుని సమస్యపై సంబంధిత జిల్లా అధికారి అర్జీదారుడుకు ఎదురైన సమస్యకు గల మూల కారణం తెలుసుకుని సమస్య పరిష్కారం కొరకు ఇంతకు ముందు గ్రామ, మండల, డివిజన్ స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినదీ లేనిదీ తెలుసుకోవడంతో పాటు సమస్య పరిష్కరించేందుకు కిందిస్థాయి అధికారులు చూపిన అలసత్వం లేదా ఇబ్బందులకు గురి చేయడం వంటి విషయాలను పరిశీలించి సమస్య పరిష్కారం ఏ స్థాయిలో చేయ వలసి ఉన్నదో క్షుణ్ణంగా పరిశీలించి ఇందుకు సంబం ధించి సమగ్ర వివరాలను అర్జీలో నమోదు చేసి చర్యల నిమిత్తం అర్జీదారుడు జిల్లా కలెక్టర్ వారిని కలిసే విధంగా పీజీఆర్ఎస్లో మార్పులు తీసుకువచ్చారన్నారు.

ఈ మార్పు వల్ల కింది స్థాయి నుండే సమస్య పరిష్కాంరoలో ఉన్న ఇబ్బందులు తెలుసుకోవడంతో పాటు సమస్య పరిష్కారం అవు తుందనే నమ్మకం అర్జీ దారు లలో కల్పించేందుకు వీలు కలిగిందన్నారు.అర్జీకి సంబం ధించిన సమస్యను పరిష్కరిం చేందుకు అర్జీదారుడు చెప్పే విషయాన్ని ఓపిగ్గా వినాలన్నా రు.పిజిఆర్ఎస్ పై ప్రజల పెట్టు కున్న నమ్మకానికి మరింత బలం చేకూర్చేలా అధికారుల పనితీరు ఉండాలన్నారు. ఆర్జీల పరిష్కా రంలో ఎటువంటి జాప్యం జరిగిన అందుకు సంబంధిత జిల్లా అధికారే భాధ్యత వహిం చాల్సి ఉంటుందని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కే మాధవి డ్వామా పిడి ఎస్ మధుసూదన్, సమగ్ర శిక్ష ఏపీసి జి మమ్మీ, ఎస్ టి సి పి కృష్ణ మూర్తి, డి ఎల్ డి వో రాజేశ్వరరావు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు