నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గం మైహోమ్ భుజాలో నివాసంలో ఉన్న ఆయనను రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ప అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో పోసానిపై సెక్షన్ 196, 353(2), 111 0 2 3(5) అయింది. కాగా, ఆయనను హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించనున్నారు.

కక్ష సాధింపు చేస్తావా బాబు? వైసీపీ
వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అరెస్టుపై ఆ పార్టీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ‘చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ను ప్రశ్నించాడనే కారణంతో కక్ష సాధిస్తూ కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టింది. పోసానికి ఆరోగ్యం బాలేదని అతని సతీమణి చెప్తున్నా దురుసుగా ప్రవర్తిస్తూ గచ్చిబౌలిలోని ఆయన నివాసం నుంచి పోలీసులు తీసుకెళ్లారు. ఇలా ఇంకెంత కాలం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తావ్ బాబు? ‘అని ట్వీట్ చేసింది.
