జిల్లా రెవెన్యూ అధికారి రాజకుమారి/కలెక్టరేట్ కు 242 ఆర్జీలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 23:

ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్య క్రమానికి విచ్చేసే అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ క్రియాత్మకంగా తగు పరిష్కార మార్గాలు నాణ్యతతో చూపాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి రాజకుమారి అధికారులకు సూచించారు.

సోమవారం స్థానిక కలెక్టరే ట్లోని గోదావరి భవన్ నందు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీకోసం కార్య క్రమంలో సుమారు 242 అర్జీలు వివిధ సమస్యల పై అర్జీదారుల నుండి డిఆర్ఓ రాజకుమారి ఏవో కాశీ విశ్వేశ్వరరావు, సర్వే ఏడి. కె ప్రభాకర్ డిఎండిఓ రాజేశ్వరరా వులుస్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు.

పీజీఆర్ఎస్ లో నమోదవుతున్న అర్జీలకు నిర్ణీత గడువులో గా పరిష్కారం చూపాల్సి న బాధ్యత అధికారులపై ఉందన్నారు. అర్జీలు ఏ స్థాయిలోనూ పెండింగ్ ఉండరాదన్నారు. అర్జీ దారుల సమస్యను అధికారులు ఓపిగ్గా విని పరిష్కార మార్గాన్ని తెలపాల్సిన బాధ్యత ఉందన్నారు. సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని అర్జీదారుల లో కలిగించాలన్నారు. అర్హతను పరిశించాలని, అనర్హత ఉంటే తగిన కారణాలను అర్జీదారునికి వివరించాలన్నారు.

పరి ష్కారమైన అర్జీదారుల తో ఐవీఆర్ఎస్ ద్వారా ఉన్నతాధికారులు వారి సంతృప్తి స్థాయిని తెలు సుకోవడం జరుగు తుందన్నారు. ఫిర్యాదు దారుల విజ్ఞప్తులను అవసరమైతే సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయి లో స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదా రుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరి పరిష్కారం ఉండాలన్నారు. గడువు లోగా పరిష్కరించాల్సిన అర్జీలపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు స్వీకరించిన అర్జీ మరల ఓపెన్ కాకుండా సకా లంలో పూర్తిగా విచారించి నిబంధనలకు లోబడి తగు పరిష్కార మార్గాలు పూర్తిస్థాయిలో నాణ్యత తో చూపి రీ ఓపెన్ కు ఆస్కారం లేకుండా చర్య లు తీసుకోవాలని ఆదేశిం చారు.

మానవసేవయే మాధవ సేవగా భావించి ప్రతి అధికారి మంచి ఆలోచన దృక్పథంతో ప్రజలకు సేవాభావంతో మేలు చేకూర్చాలన్నారు. ప్రతి అధికారి తమ వద్ద కు వచ్చిన ప్రతి సమస్యపై లోతైన విచారణ, ఆలోచ న చేసి శాశ్వత ప్రాతిపది కన ఆ యొక్క సమస్యల కు పరిష్కార మార్గాలు దూరదృష్టితో చూపాలని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతి ష్టాత్మకంగా పి జి ఆర్ ఎస్ కార్యక్రమాన్ని నిర్వహి స్తూ ప్రతివారం ముఖ్య మంత్రివర్యులు పిజిఆర్ ఎస్ అర్జీల పరిష్కార సరళపై సమీక్షించడం జరుగుతుందని కావున అధికారులు పి జి ఆర్ ఎస్ పై ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో సమస్యలకు తగు పరిష్కార మార్గాలు పూర్తిగా చూపాలన్నారు. ఈ కార్యక్రమంలోజిల్లా వ్యవసాయ అధికారి బో సుబాబు, ఎల్ డి ఎం కేశవ వర్మ ,సాంఘిక సంక్షేమ శాఖ జీడి పి జ్యోతిలక్ష్మి దేవి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం దుర్గారావు దొర వివిధ శాఖలకు చెందిన అధి కారులు సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

కేంద్ర ప్రాయోజిత పథకాలు: అధికారులు కీలక భూమిక పోషించాలి: పార్లమెంట్ సభ్యులు జి హరీష్ మాధుర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ -అమలాపురం ఏప్రిల్ 23: కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ఆర్థిక ఫలాలు లక్షిత వర్గాలకు అందించడంలో అధికారులు కీలక భూమిక పోషించాలని స్థానిక పార్లమెంట్ సభ్యులు […]

ఉద్యానవనం ముగ్గుల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అయితాబత్తుల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 11:అమలాపురం సూర్య బలిజ సంఘం ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలో ఉన్న ఉద్యానవనం నందు శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం […]

ఏఎంసీ చైర్మన్ చిట్టూరి శ్రీనివాస్ చౌదరి మర్యాదపూర్వకంగా కలిసిన జర్నలిస్ట్ వినయ్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 15: అంబాజీపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టూరి శ్రీనివాస్ చౌదరి ని జర్నలిస్ట్ వినయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు. డాక్టర్ […]

ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు

👉ఎల్లాప్రగడ సుబ్బారావు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 35 పోస్టులు, ప్రభుత్వ ఆసుపత్రిలో 87 పోస్టుల భర్తీ. 👉ఖాళీల వివరాలు: మెడికల్ కాలేజీలో స్టోర్ కీపర్, కంప్యూటర్ ప్రోగామర్, ఎలక్ట్రిక్ హెల్పర్, ఆఫీస్ సబార్డినేట్, మార్చురీ […]