
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -కె గంగవరం, జూలై 01:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలు నిర్వ హిస్తున్నట్లు వదంతులు వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వారు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఇసుక రీచ్ లను తనిఖీ చేసి నివేదిక సమర్పిం చాలన్న సూచనలకు అనుగుణంగా మంగళవారం కే గంగవరం మండల పరిధిలోని మసకపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 8 లో ఏటుగ ట్టు వద్ద అక్రమంగా గోం డ్రు మట్టిని మూడు లారీలలో తరలిస్తుండగా మూడు లారీలను సీజ్ చేసినట్లు ఆర్డిఓ దేవర కొండ అఖిల తెలిపారు జిల్లా కలెక్టర్ వారి ఆదేశా నుసారం మంగళవారం ఆర్డిఓ నేతృత్వం లోని రెవెన్యూ పోలీసు అధికా రుల బృందం ఆకస్మిక తనిఖీ లు నిర్వహించగా అక్రమంగా ఎటువంటి అనుమతులు పొంద కుండా గోండ్రు మట్టి తరలిస్తున్న సీట్ చేసి జిల్లా భూగర్భ గనుల శాఖకు అప్పగిం చడం జరిగిందని ఆర్డిఓ అఖిల తెలిపారు. ఈ తనిఖీలు తాసిల్దారు శ్రీరామ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వీఆర్వో, పోలీసులు తదితరులు పాల్గొన్నారు