
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం సెప్టెంబర్ 14:

ఈనెల 15 వ తేదీ సోమవారం జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాల ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీ దారులు తమ దరఖాస్తులను జిల్లా కలెక్టరేట్ కు వచ్చే అవసరం లేకుండా
meekosam.ap.gov.in లో ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించ వచ్చునన్నారు. దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో ప్రస్తుత సమాచారం ఆన్లైన్లో తెలుస్తుందని లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1100 ను సంప్రదించి తెలుసు కోవచ్చన్నారు. అర్జీ దారులు తమ అర్జీలను సంబంధిత మండల, డివిజన్, మున్సి పాలిటీలలో అందుబాటులో ఉండే అధికారులకు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. మండల, డివిజన్ స్థాయిలలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా అమస్యల పరిష్కారవేదిక కార్యక్రమానికి రావాలని ఆమె తెలిపారు ఉదయం 10 గంటల కు అధికారులందరూ తప్పని సరిగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. సుపరిపాలన అందించే దిశగా ప్రభు త్వం ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిం చిందని దానిలో భాగంగానే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అత్యంత పారద ర్శకంగా నిర్వహిస్తూ ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకై ఆధునిక సాంకేతిక వ్యవస్థలను అందు బాటులో తెచ్చిందన్నారు.