
బోటు నుంచి జారిపడిన మత్స్యకారులు.రెండుకు చేరిన మృతుల సంఖ్య

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అంతర్వేది జూన్ 16:
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలోని సాగర సంగమం వద్ద మత్స్యకారులు బోటు నుంచి జారీ పడ్డారు.ఈ ఘటనలో ఇప్పటికే ఒకరు మృతి చెందగా,మరొకరి మృతదేహం లభ్యమైంది.దీంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది. కాగా మరొకరి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కృష్ణా జిల్లా నాగాయలంక నుంచి చేపల వేటకు మత్స్యకారులు ఇక్కడికి వచ్చారు. వారు అంతర్వేది తీరానికి చేరుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.