

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి 10:
ఎమ్మార్వో నాగలక్ష్మమ్మ పై తీవ్రంగా దాడి చేసిన వారిపై కఠినమైన చర్య తీసుకోవాలని కలెక్టర్ మహేష్ కుమార్, తహశీల్దార్ రెవిన్యూ అసోసియేషన్ వినతి పత్రం అందజేశారు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న తహశీల్దార్లు అయినవిల్లి తహశీల్దార్ మీద జరిగిన దాడి ను తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మరియు జాయింట్ కలెక్టర్ టి నిషాంతి లకు వినతి పత్రాన్ని సమర్పించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయానికి తహశీల్దార్ అందరూ వచ్చి కలెక్టర్ కు సంఘటన విషయాలను పూర్తిగా వివరించారు.అందులో భాగంగా దాడి చేసిన వ్యక్తికి సదరు మండలంలో ఏ విధమైన భూములు లేకపోయినప్పటికీ అతని సంబంధించి ఏ విధమైన కార్యాలయాలు కార్యక్రమాలు గాని ఏ విధంగా పెండింగ్లో లేనప్పటికీ కక్షపూరితంగా వచ్చి దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తూ దోషి పై చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు, ఈ విషయంలో స్థానిక జిల్లా నుండి వచ్చిన తహశీల్దార్లు అందరు అయినవిల్లి తహశీల్దార్ నాగలక్ష్మమ్మ కు సంఘీభావాన్ని తెలియజేస్తూ దోషులకి శిక్ష పడేంత వరకు కూడా అందరం తోడుగా ఉంటామని కలెక్టర్ ముందు బాధ్యత ఎమ్మార్వో కు భరోసా కల్పించి ధైర్యం చెప్పారు.
ఘటన జరిగిన వెంటనే కలెక్టర్ , మరియు జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ వెంటనే స్పందించినందుకు వారికి యూనియన్ తరపున ధన్యవాదాలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో జిల్లా ఏపీ ఆర్ఎస్ ఏ, మరియు ఏపీ జేఏసీ అధ్యక్షులు డి శ్రీనివాస్ , మరియు జిల్లాలో అందరూ తహసీల్దారులు, మరియు డిప్యూటీ తాసిల్దారులు, పాల్గొన్నారు.