


V9ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం 20:

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తెలుగు మహిళా మరియు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్, ఆధ్వర్యంలో సాక్షి మీడియా కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. సాక్షి టీవీలో జరిగిన ఒక డిబేట్‌లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టులు వి.వి.ఆర్. కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు మరియు ఛానల్ అధినేత భారతి రెడ్డి పై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

అమరావతిని ‘వేశ్య రాజధాని’గా అభివర్ణించిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజధాని హక్కు కోసం పోరాడుతున్న అమరావతి మహిళల త్యాగాలను అవమానించడమే కాకుండా, వారి మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని కూటమి మహిళా విభాగం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి అనంతకుమారి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు చిలువూరు సతీష్ రాజు గారు, TNSF రాష్ట్ర కార్యదర్శి నక్కా సునీల్ రాజు ,తెలుగు మహిళ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి అధికారి జయలక్ష్మి పాల్గొన్నారు. అలాగే కూటమిలోని మహిళా కార్యకర్తలు, నాయకులు సైతం హాజరయ్యారు.