

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 10:

సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ, రేషన్ పంపిణీ, దీపం 2, మూడు ఉచిత సిలిండర్లు పంపిణీ,గ్యాస్ డోర్ డెలివరీ, ఆసుపత్రి వైద్య సేవలు, దేవాలయ వసతులు ఆర్టీసీ ప్రయాణ సదు పాయాలు పారిశుద్ధ్యం వంటి ప్రజా సేవలలో మెరుగైన సంతృప్తి స్థాయిలను తీసుకునిరావాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

మంగళవారం స్థానిక కలెక్టరేట్ నుండి మండలస్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజా సంతృప్తి స్థాయిలను మెరుగుపరిచి ఐవిఆర్ఎస్, క్యూ ఆర్ కోడ్ మాధ్యమాల ద్వారా ఎటువంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా జిల్లాలో ఆయా సేవల అందుబాటులో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుని రావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛన్ల పంపిణీలో లబ్ధి దారులతో మర్యాదపూ ర్వకంగా ప్రవర్తించి, అవినీతికి ఆస్కారం లేకుండా పింఛన్లను సకాలంలో అందించాల న్నారు. అన్నా క్యాంటీన్ల ను మున్సిపల్ కమిష నర్లు సకాలంలో తెరిచి ఉంచేలా నాణ్యమైన భోజనాన్ని అందించేలా నిత్యం పర్యవేక్షించి నాణ్యమైన సేవలను అందించాలన్నారు ఎరువులు విత్తనాలను వ్యవసాయ శాఖ అధి కారులు రైతాంగానికి సకాలంలో అందించి ఎటువంటి అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా పరిశీలించాల న్నారు మాదకద్రవ్యాల కు యువత బానిసలు కా కుండా నియంత్రణ చర్యలను చేపట్టాలని ఎక్సైజ్ శాఖ అధికారు లను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం వారానికి నాలుగు అంశాలు చొప్పున ప్రభుత్వ సేవలు సరళిని సమీక్షిస్తోందని ఆ దిశగా అధికారులు అంకితభావం జవాబు దారితనంతో ప్రజాసం తృప్తి కొలమానంగా పనిచేయాలని సూచిం చారు. రెవెన్యూ సద స్సుల సమస్యలను విచారణ చేస్తున్నారన్నా రు. ఐ విఆర్ఎస్ ద్వారా ఏ ఏ గ్రామాల నుండి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయో మ్యాపింగ్ చేసి సంబంధిత మండల అధికారుల పర్యవేక్షణ కొరకు నివేదించాల న్నారు. ఆసుపత్రులలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని మొదటగా వైద్యులు అందుబాటులో ఉండాలని రోగులతో మర్యాదపూర్వకంగా పలకరించి మెరుగైన వైద్య చికిత్సలు అందించి రోగి సంతృప్తి చెందేలా సిబ్బంది వ్యవహరించా లని సూచించారు.

వైద్యు లు సిఫార్సు చేసిన వైద్య పరీక్షలు నిర్వహి స్తూ అందుబాటులో ఉన్న ఔషధాలను సరఫరా చేసి ప్రతి పారామీటర్ వారీగా రోగులకు చికిత్సలు అందించాలన్నారు సిబ్బంది సత్ప్రవర్తనతో ఎక్కడా నిర్లక్ష్యానికి తావు లేకుండా వ్యవహరిస్తూ అంకితభావంతో సేవలు అందించాలని సూచించా రు. లబ్ధిదారులు ఫిర్యా దు నమోదు సమయంలో అందించిన సెల్ నెంబరు ఆధారంగా ఐవిఆర్ఎస్ ద్వారా సర్వీస్ రిక్వెస్ట్ స్పందనను ఫిర్యాదుదా రుల నుండి ప్రభుత్వం సేకరించి సంతృప్తికరం కానిచో మరల యొక్క దరఖాస్తులు పునరా వృతం అవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఆ విధంగా కాకుండా అత్యంత పారదర్శకంగా జవాబుదారితనంతో సమస్యను పరిష్కరించా ల్సిన ఆవశ్యకత నేడు ఎంతైనా ఉందన్నారు.

ఏ మండలంలో ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయో పరిశీలించి వాటిని ఎంపీడీవోలు చక్కదిద్దా లని ఆదేశించారు. ఆర్టీసీ బస్టాండ్లలో బస్సుల రాకపోకల, ధరల పట్టికలు ప్రదర్శించాలని, త్రాగునీ రు మరుగుదొడ్లు వసతు లు. మెరుగైన పారిశుధ్య ఏర్పాటులు చేపట్టాలన్నా రు.ప్రముఖ ఆలయాలలో దర్శన ఏర్పాట్లు మౌలిక సదుపాయాలు వెయి టింగ్ రూములు ప్రసాదాల తయారీ భక్తులు వసతులు అంశాలకు ప్రాధాన్యత నివ్వాలన్నారు. ఏపీ ట్రాన్స్కో ఇంజనీర్లు నాణ్యమైన విద్యుత్ సరఫరాను నిరంతరా యంగా అందించాలన్నా రు. గ్రామీణ పట్టణ ప్రాం తాలలో ఇంటింటి నుండి చెత్త సేకరణ, వారానికి రెండు రోజుల చెత్త సేకరణ తప్పనిసరిగా జరగాలన్నారు. రేషన్ దుకాణాల ద్వారా 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు దివ్యాంగులకు సక్రమంగా ఇంటి వద్దనే నిత్యవసరాలు డెలివరీ చేయాలన్నారు దీపం 2 కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా అందించా లన్నారు గ్యాస్ ఇంటింటి డెలివరీ సందర్భంలో అదనంగా డబ్బులు వసూలు చేయరాదని ఆయన సూచించారు. ప్రజా సంతృప్తి స్థాయిల ను రాష్ట్ర ప్రభుత్వం నిత్యం పర్యవేక్షిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిశాంతి, ఆర్డీవోలు పీ శ్రీకర్ డి అఖిల కే మాధవి డి ఎం అండి హెచ్ ఓ దుర్గారావు దొర డి సి హెచ్ ఎస్ ఆర్ టి సి జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.