
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 11:

ప్రకృతి సహజ సిద్ధ సేంద్రియ వ్యవసాయ సాగు విధానాలు ద్వారా భూసా రాన్ని కాపాడేలా పెట్టుబ డులు రసాయన ఎరువుల ఖర్చులు తగ్గించి వినియోగ దారులకు రసాయన రహిత ఆహార ఉత్పత్తులను అందించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కోన సీమ రైతాంగానికి పిలుపు నిచ్చారు.

గురువారం స్థానిక అమలాపురం కలెక్టరేట్ నందు జాతీయ సహజ వ్యవసాయ మిషన్ అమలులో భాగంగా ఏపీ ప్రజాభాగస్వామ్య ప్రకృతి సేంద్రియ వ్యవసాయం పద్ధతులపై వ్యవసాయ అనుబంధ విభాగాలతో కన్వర్జెన్స్ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించి వార్షిక కార్యాచరణ ప్రణా ళికలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రకృతి సహజ సిద్ధ సేంద్రియ వ్యవసాయం స్థిర మైన ప్రాయోజిత కార్యక్రమమని వాతావరణ స్థితి స్థాపకత సురక్షితమైన ఆహారం వైపు శాస్త్రీయంగా మద్దతు ఉన్న విధానాలతో వ్యవసాయ పద్ధతులను బలోపేతం చేస్తుందన్నారు.

నేల ఆరోగ్యాన్ని మెరుగు పరచడం, పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరిస్తూ రైతుకు పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించడం ద్వారా మా నవుని సగటు జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఈ వ్యవస్థ రూపొందించబడిందన్నారు సహజ వ్యవసాయం రసాయన రహిత వ్యవ సాయమనీ, ఇందులో పశువులు ప్రాధాన్యంగా స్థానిక ఆవు జాతి, సమగ్ర సహజ వ్యవసాయ పద్ధ తులు 2018 నుండి 22 మండలాల పరిధిలో 140 క్లస్టర్లలో వివిధ గ్రామాలలో అమలు చేస్తూ నాణ్యమైన ఉత్పత్తులను అందించడం జరుగుతోoదన్నారు. ఈ విధానాన్ని మరింత ప్రాచు ర్యంలోకి తీసుకుని వచ్చేలా వ్యవసాయ ఉద్యాన పశు సంవర్ధక గ్రామీణాభివృద్ధి
కృషి విజ్ఞాన కేంద్రాలు విశ్వ విద్యాలయాలు కృషి చేయా లన్నారు. ప్రకృతి ఆధారిత స్థిరమైన వ్యవసాయ వ్య వస్థలను ప్రోత్సహించ డానికి, బయటి నుండి కొనుగోలు చేసిన ఇన్ పుట్‌లపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మరియు ఇన్‌పుట్ ఖర్చును తగ్గిం చడానికి సాగులో బయో- ఇన్‌పుట్‌ల వినియోగాన్ని పెంచుతూ నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు స్వయం సహాయక సం ఘాల మహిళలు ఆవుల మూత్రంతో జీవామృతం కషాయాలు తయారుచేసి పంటల సాగు కొరకు విక్ర యిస్తున్నారన్నారు. డిఆర్డిఏ అధికారులు మరింత మంది డ్వాక్రా సంఘాలకు ప్రకృతి సేంద్రీయ కషాయాలు త యారీలో సెక్షన్లు ఇప్పించి క్షేత్రస్థాయిలో పిచికారి వినియోగంపై కూడా తర్ఫీదును ఇవ్వాలని సూచించారు. వరి,అరటి కొబ్బరి బొప్పాయి తదితర ఉద్యాన పంటలు సాగులో వీటి వినియోగాన్ని జిల్లా వ్యాప్తంగా పెంచాలని ఆయన ఆదేశించారు. ఇక భవిష్యత్తులో ప్రకృతి సహజ సిద్ధ వ్యవసాయ విధానాలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధా లుగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఖరీఫ్ సీజన్కు ముందు ఫ్రీ మాన్సూన్ డ్రై షోయింగ్ కిట్ల ద్వారా 31 రకాల పచ్చిరొట్ట ఎరువులు సాగు ను 41 రోజులు పాటు చేపట్టి తదుపరి అక్కడి కక్కడే నేలలో దున్ని ఎడల మంచి ఎరువుగా తయారై పరోక్షంగా భూసారాన్ని కాపాడడంతోపాటు ప్రత్య క్షంగా రసాయన రహిత నాణ్యమైన పంటల సాగుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ నెల 20వ తేదీ నాటికి మండలాలు గ్రామాలు వారీగా, పంట రకాలు వారీగా ప్రకృతి సేద్య విధానాలు అమలుపై కా ర్యాచరణ ప్రణాళికలను రూపొందించి సమర్పించాల న్నారు. వ్యవ సాయ ఆధారిత జిల్లాగా విరాజిల్లుతున్న కోనసీమ జిల్లాలో ఈ యొక్క సాగు విధానాల పట్ల మండల స్థాయిలో ఏపీఎం వ్యవ సాయశాఖ ఎంఈఓ సహకారంతో వర్క్ షాపులు నిర్వహించి ప్రకృతి సేద్య విధానాల పట్ల సమగ్రమైన అవగాహన, మక్కువను పెంపొందించి ఆ దిశ గా ప్రోత్స హించాలని ఆదేశించారు. భవిష్యత్ తరాల వారికి మాతృభూమి పునర్జీవనంతో కూడిన స్థిరత్వాన్ని అందిం చాలని ఆయన స్పష్టం చేశారు ప్రజా భాగ స్వామ్య ప్రకృతి వ్యవసాయ విభాగం డిపీఎం శ్రీనివాసు అదనపు డిపిఎం సత్యనారాయణలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తొలుతగా అవగాహన కల్పిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బోసు బాబు, జిల్లా పశుసంవర్ధక అధికారి వెంకట్రావు, డిహెచ్ఓ రమణ, ప్రకృతి సేద్య అభ్యు దయ రైతులు తదితరులు పాల్గొన్నారు.