షైనింగ్ స్టార్ – 2025 అవార్డులను 168 మంది విద్యార్థిని విద్యార్థులకు సత్కారం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 09:

విద్యా వ్యవస్థలో నాణ్యత, ప్రమాణాలు పెంచేందుకు పదవ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు .

సోమవారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్ నందు జిల్లా స్థాయి షైనింగ్ స్టార్ – 2025 అవార్డులను 168 మంది విద్యార్థిని విద్యార్థులకు అందించి సత్కరించారు.

ఈ సందర్భంగా ఆయన 10, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో సైనింగ్ స్టార్స్ అవార్డ్- 2025′ పేరిట సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

ఈ షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానo జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యనభ్యసించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 139 మంది ఇంటర్మీడియట్లో 29 మంది వెరసి 168 విద్యార్థినీ విద్యార్థులకు ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ 20 వేలు, నగదు బహుమతి ప్రశంసా మెడల్ ను బహుకరించి ఘనంగా సన్మానించారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ప్రత్యేక అవసరాలు గల పిల్లల కేటగిరీలో వీరిని ఎంపిక చేశారన్నారు.


పది,ఇంటర్మీడియట్ విద్యలో నాణ్యత, నైపుణ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో అవార్డుల బహుకరిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి ఏ,బి,సి కేటగిరీలుగా విభజించి 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా జిల్లాను రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిపామన్నారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక స్టడీ మెటీరియల్ ను రూపొందించి పటిష్టంగా అమలు చేయడం ద్వారా సత్ఫలితాలు వచ్చేయన్నారు.

పేరెంట్-టీచర్స్ సమావేశాలు నిర్వహించి విద్యార్థుల ప్రోగ్రెస్లో పురోగతి సాధించాలన్నారు వెనుకబడిన విద్యార్థుల కోసం కేర్ టేకర్ వ్యవస్థ ద్వారా ప్రతి జూనియర్ ఒక్కొక్క ఉపాధ్యాయుడికి కనీసం 10 మంది విద్యార్థులను దత్తత తీసుకుని ఫలితాలను మెరుగుపర్చే బాధ్యత అప్పగించాలన్నారు.

ఈ విద్యా సంవత్సరం నుంచి కరిక్యులమ్లో మార్పులు చేస్తూ జిల్లాను మొదటి స్థానంలో నిలపా లన్నారు అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతికతలకు అనుగుణంగా కొత్త పాఠ్యాంశాలను పరీక్షా విధానాన్ని అమలు చేయాలన్నారు.

8 9 10 + విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అత్యంత ముఖ్య మని ముందుగా నిర్దేశిం చుకున్న గోల్స్ సాధించేందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ద్వారా మార్గాలను అన్వేషించు కొని కెరీర్ కౌన్సిలింగ్, ద్వారా కెరీర్ ప్లానింగ్ చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను ఆయన ముచ్చటించి భవిష్యత్తులో కెరీర్ ప్లానింగ్ అంశాలను ఆరా తీశారు.

అదేవిధంగా ఆ యొక్క గోల్స్ సాధనకు చేపట్టాల్సిన మార్గాలు కార్యాచరణ ప్రణాళికలు గూర్చి వారికి విశదీకరించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు యొక్క సైనింగ్ స్టార్ అవార్డుల ప్రధానం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని జిల్లా కలెక్టర్ వారికి తమ స్పందనను తెలియజేశారు.

విద్యార్థులు వారి తల్లిదండ్రులు సూచనలు పరిగణనలో తీసుకుని రాష్ట్రస్థాయిలో నివేదించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.పి గన్నవరం శాసన సభ్యులు జి సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రధాన ఉత్సవాలను నిర్వహిస్తుందన్నారు.

భవిష్యత్తులో కూడా ఇదే ప్రతిభను కనబరిచి ఉన్నత శిఖరాలు అధిరోహించి జిల్లాకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుని రావాలన్నారు విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు నాగమణి మాట్లాడుతూ గత ఏడాది రాష్ట్రంలో 14వ స్థానంలో ఉన్న జిల్లాను ఈ ఏడాది జిల్లా కలెక్టర్ వారి దార్శనికత ప్రత్యేక చొరవ, మార్గ నిర్దేశనoతో విద్యా శాఖ జిల్లాను రెండో స్థానంలోకి తీసుకువచ్చామన్నారు భవి ష్యత్తులో మొదటి స్థానానికి తీసుకుని వచ్చేలా ప్రత్యేక చొరవ చూపడానికి కృషి చేస్తామన్నారు.

జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం భాష విద్యాశాఖ పదవ తరగతి లో జిల్లాను రాష్ట్రంలో రెండో స్థానానికి తీసుకుని రావడానికి చేపట్టిన అం శాలు గూర్చి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆహార కమిషన్ సభ్యులు జక్కంపూడి కిరణ్, ఇంటర్మీడియట్ బోర్డ్ జిల్లా అధికారి వి సోమశేఖర రావు, సర్వ శిక్ష ఏపీసి జి మమ్మీ హనుమంతరావు, సుబ్రహ్మణ్యం జిల్లా సైన్స్ అధికారి జి వి ఎస్ సుబ్రహ్మణ్యం తదిత రులు పాల్గొన్నారు.

Related Articles

కుట్టు మిషన్ సెంటర్ ను సందర్శించిన ఎమ్మార్వో ఎస్ దివాకర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ఉప్పలగుప్తం మే 13: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం ఎమ్మార్వో ఎస్ దివాకర్ కుట్టు మిషన్ సెంటర్ ను సందర్శించారు. […]

V9 ప్రజా ఆయుధం దినపత్రిక/అండ దండుగా మాజీ మంత్రి & చైర్ పర్సన్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రాజోలు జూలై 08: V9 ప్రజా ఆయుధం దినపత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ […]

సంక్షేమ వసతి గృహాలలో చేరే పేద విద్యార్థులు భవితకు సోపానాలుగా వసతి గృహాలు: మంత్రి డోలా శ్రీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 16: విద్యే ఏకైక ఆయుధంగా భావించి చదువుకోవాలనే పవిత్ర ఆశయంతో సంక్షేమ వసతి గృహాలలో చేరే పేద విద్యార్థుల భవితకు సోపానాలుగా […]

పరిష్కార వేదిక/1100 కాల్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 25:ఈ నెల మే 26 వ తేది సోమ వారం ఉదయం 10 గంటల నుండి స్థానిక కలెక్టరేట్లో గోదావరి భవన్ […]