V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జనవరి 03:
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం భూపయాగ్రహారంలో శుక్రవారం దళిత సేన ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 194 వ.జయంతి ను ఘనంగా నిర్వహించారు.సాపే రమేష్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం దళిత సేన అధ్యక్షుడు డేవిడ్ అంబేద్కర్ మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే గొప్పతనాన్నితెలియజేశారు.సావిత్రిబాయి పూలే భారతదేశ తొలి మహిళా గురువు,సమాజ సుధారకురాలు, మరియు మహిళల హక్కుల పోరాటానికి మార్గదర్శకరాలు,ఆమె ఆ కాలంలోనే మహిళలకు విద్యపరంగా వెనుకబాటు పరిస్థితిని మార్చేందుకు కృషి చేసింది.సావిత్రిబాయి పూలేకు ఆమె భర్త జ్యోతిరావు పూలే మద్దతుతో విద్యాభ్యాసం ప్రారంభమైంది.ఆమె 1848లో పూణేలో మహిళల కోసం తొలి పాఠశాలను స్థాపించింది.కుల వ్యవస్థను వ్యతిరేకంగా,స్త్రీల స్వతంత్రంకు ఆమె కృషి చేశారు.సావిత్రిబాయి పూలే కు వ్యతిరేకంగా సామాజిక ఒత్తిడి వచ్చినప్పటికీ ఆమె ప్రయత్నాలు ఆపలేదు.అవమానాలను ఎదుర్కొంటూ,ఆమె మహిళల కోసం అనేక పాఠశాలను స్థాపించింది.పేద ప్రజల కోసం అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.అలాంటి మహనీయురాలను స్త్రీలందరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో తానంకి వసంత్ కుమార్, వాకపల్లి హరీష్, సాక నవీన్,ధోనిపాటి నవీన్ కుమార్,కమిడి సామ్యూల్ జ్యోతి, గోసంగి జాకో ప్రభు,సాక మరీ, ముత్తబత్తుల శివ తదితరులు పాల్గొన్నారు.
