
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం, మే 26:

హెలికాప్టర్ ల్యాండింగ్ కొరకు హెలిప్యాడ్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ నేతృత్వంలోని అధికారుల బృందం తొలుతగా పరిశీలించింది.

ఈనెల 31వ తేదీ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,ముమ్మిడివరం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయడంతో పాటు పురోగతిలో ఉన్న ప్రభుత్వ కార్యక్రమాల ను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు, సోమవారం స్థానిక మండల పరిధిలోని సిహెచ్ గున్నేపల్లి లో ముఖ్యమంత్రి వర్యుల పర్యటన ముందస్తు ఏర్పాట్లకు సంబంధించి హెలికాప్టర్ ల్యాండింగ్ కొరకు హెలిప్యాడ్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ నేతృత్వంలోని అధికారుల బృందం తొలుతగా పరిశీ లించింది.

అనంతరం కాట్రేనికోన మండలం చెయ్యే రు గ్రామంలో ప్రభుత్వ, దాతలు, ప్రజలు భాగస్వా మ్యంతో జిల్లాస్థాయిలో ప్రారంభించే (పి4) కార్యక్రమ సభ, బహిరంగ వేదిక ఏర్పా ట్లను బృందం పరిశీలించింది. అదే విధంగా చెయ్యేరు సభా వేదిక సమీ పంలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపా ధి హామీ పథకం చెరువుల పథకం ద్వారా రూ.9 లక్షల 80 వేల అంచనా వ్యయంతో పూడిక తీస్తున్న చెరువు అభివృద్ధి పనులను బృందం పరిశీలించింది.

ఈ యొక్క చెరువు పూడికతీత అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ము ఖ్యమంత్రివర్యులు నిశితంగా పరిశీలించనున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు చెయ్యేరు గ్రామ అభివృద్ధి గ్రామంలో వివిధ ప్రభుత్వ పథకాలు అమలు తీరు భౌగోళిక విస్తీర్ణం జనాభా తదితర వివరాలను సేకరించి సిద్ధం చేయాలని జిల్లా పంచా యతీ అధికారి శాంత లక్ష్మిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఏర్పాట్లకు సంబం ధించి శాఖల అధికారులకు ఆదేశాలు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ సూపరింటెం డెంట్ బి కృష్ణారావు, డ్వామా పథక సంచాలకులు ఎస్ మధుసూదన్,ఆర్ అండ్ బి ఎస్ ఇ బి రాము, పంచాయ తీరాజ్ ఎస్.ఇ, పి. రామకృ ష్ణారెడ్డి, ఆర్డీవో కే మాధవి, నాయకులు దాట్ల రాజేష్, చెల్లి సురేష్ ఎంపీడీవో వెంకటాచలం తాసిల్దార్ సునీల్ కుమార్, ఉప తాసిల్దార్ గోపాలకృష్ణ సీఐ మోహన్ ఎస్ హెచ్ ఓ అవినాష్ నరేగా ఏపీవో బి చంద్ర మోహన్ గ్రామ పెద్దలు క్షేత్రస్థాయి సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు.