
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- ఢిల్లీ మే 26:
గయానా దేశంలో అఖిల పక్ష బృందానికి ఘన స్వాగతం పలికిన భారతీయులు…

గయానా దేశ ఉపాధ్యాక్షులు భారత్ జిగ్డియో తో సమావేశమైన అఖిల పక్ష బృందం…

న్యూయార్కు పర్యటన ముగించుకుని గయానా దేశం చేరుకున్న విదేశీ అఖిల పక్ష బృందానికి ఆ దేశంలో నివసించే భారతీయులు ఘనంగా స్వాగతం పలికినట్లు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ భారత ఎంపీల ప్రతినిధి బృందం గయానా మాజీ అధ్యక్షుడు (2000-2012) మరియు ప్రస్తుత ఉపాధ్యక్షుడు భరత్ జగ్డియోతో అధ్యక్ష భవనంలో అద్భుతమైన సమావేశం జరిగినట్లు తెలిపారు.ఇటీవలి సంఘటనల నేపథ్యంలో భారతదేశం యొక్క ఆందోళనల పట్ల ఆయన బలమైన సానుభూతి మరియు అవగాహనను వ్యక్తం చేయడంతో పాటు, చమురు మరియు గ్యాస్ ఆవిష్కరణ తర్వాత గయానా రికార్డు స్థాయిలో 30% వార్షిక ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించిన అనేక అంశాలను కూడా ఈ సమావేశంలో ప్రస్తావించమన్నారు.

వ్యవసాయం నుండి టెలికాం, బ్యాంకింగ్ మరియు హైవే అభివృద్ధి వరకు రంగాలలో భారతీయ కంపెనీలకు పెద్ద సంఖ్యలో అవకాశాలు ప్రస్తావించబడ్డాయని గయానా దేశం కూడా కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది మరియు భారతీయ కార్మికులను కూడా స్వాగతిస్తామని జిగ్డియో వివరించినట్లు హరీష్ తెలిపారు.

ఇటీవల పాకిస్థాన్ ముష్కలు పహల్గాం లో చేసిన దాడి కలచి వేసిందని మృతి చెందిన వారి కుటుంబాల రోదన బాధ కలిగించినట్లు అక్కడి భారతీయులు చెప్పారన్నారు.పాకిస్థాన్ దుశ్చర్యలను ప్రపంచ దేశాలకు తెలియజేయడమే కాకుండా ఉగ్రవాదం పై భారత దేశ వైఖరిని తేటతెల్లం చేస్తున్న శశి థరూర్ బృందాన్ని అక్కడి భారతీయులు ప్రశంసించినట్లు తెలిపారు.ఏ దేశంలో వున్నా భారతీయులంతా ఉగ్రవాదం నశించాలనే కోరుకుంటున్నట్లు ఎంపీ హరీష్ బాలయోగి పేర్కొన్నారు.