

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి మే 24:

ధాన్యం జట్టుకూలి శ్రీనివాస్ శనివారం మృతి మృతి చెందాడు. శ్రీనివాస్ కు భార్య, కుమారుడు కుమార్తె ఉన్నారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం శానపల్లిలంక గురువు, భీమా కాలనీ పేద దళిత కుటుంబానికి చెందిన పల్లి శ్రీనివాసరావు వయసు 46″ తండ్రి బాలయ్య, కూలి పని చేసుకుంటూ శ్రీనివాస్ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ధాన్యం సీజన్ సమయంలో ట్రాక్టర్ పై ధాన్యం బస్తాలు ఎగుమతి దిగుమతి చేసే జట్టు పనికి వెళ్లే అలవాటు ఉంది. అలవాటుగా యధావిధిగా 20 రోజులు క్రితం గ్రామంలో ఉన్న ధాన్యం వ్యాపారి ట్రాక్టర్ లోడింగ్ పనికి గ్రామస్తులతో పాటు శ్రీనివాస్ కూడా ఆరోజు వెళ్లాడు. ప్రమాదవశాస్తూ… ధాన్యం లోడుతో ఉన్న ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. సమయంలో ఇంజిన్ పైన ఉన్న కూలీలు ఒకసారిగా రోడ్డుపై పడ్డారు.

అందులో శ్రీనివాస్ తలకు పెద్ద దెబ్బ తగిలి తల భాగంలో రక్తము గడ్డ కట్టడం వల్ల కాకినాడ మెడికవర్ ఆస్పటల్ లో చికిత్స పొందుతూ… అమలాపురం ఏరియా హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తుండగా శానపల్లిలంక గ్రామం శ్రీనువాస్ కు చెందిన ఇంటి దగ్గర (సమీపం)లో శనివారం మృతి చెందారు. మృతిడు శ్రీనివాస్ భార్య ఫిర్యాదు మేరకు ఈ ప్రమాదంపై అయినవిల్లి సబ్ ఇన్స్పెక్టర్ శాస్త్రి శనివారం ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేశారు. అనంతరం ఎఫ్ఐఆర్ నమోదయినట్లు మీడియాకు తెలిపారు.