డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రెట్ కు 300 అర్జీలు//

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఏప్రిల్ 07 :

ప్రతి అధికారి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) కార్యక్రమం పై పూర్తి అవగాహన పెంపొందించుకొని ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరిస్తూ ప్రజా సంతృ ప్తి స్థాయిలను మెరుగుపరచాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు.

సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ టి నిషాoతి డీఆర్వో రాజకుమారి డిఆర్డిఏ పిడి సాయినాథ్ జయచంద్ర గాంధీ, డ్వామా పిడి ఎస్ మధుసూదన్ ఎస్డిసి కృష్ణమూర్తిలు అర్జీదా రుల నుండి సుమారుగా 300అర్జీలను సేకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసంగిస్తూ ప్రజా సంతృప్తే కొలమానంగా ప్రభుత్వం సంక్షేమ కార్య క్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఒకసారి సమర్పించిన అర్జీ మరలా అదే అంశం పై పునరావృతo కాకుం డా అధికారులు అప్రమ త్తంగా వ్యవహరించాలన్నారు నిర్ణీత సమయం లో ప్రజా ఫిర్యాదుల సమస్యలను పరిష్కరించి గడువు దాటిన అర్జీలు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు ప్రజలకు అందిస్తున్న సేవల్లో భాగంగా ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పి.జి. ఆర్.ఎస్ ను నిర్లక్ష్యం చేయకుండా ప్రజలు పెట్టుకున్న ఆర్జీలను, ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరి స్తూ సంతృప్తి స్థాయిలను పెంచాలని ఆదేశించారు. ప్రతిరోజు పి.జి.ఆర్.ఎస్ ఫిర్యాదుల కొరకు అధి కారులు, ఉద్యోగులు నిర్ణీత సమయం కేటా యించి వాటిని పరిష్కరించాలన్నారు.

రాష్ట్రస్థాయి లో పి జి ఆర్ ఎస్ సమ స్యల పరిష్కారంపై నిత్యం పై స్థాయి నుండి కింది స్థాయి వరకు సమీ క్షిస్తున్నారన్నారు ప్రజలకు అందించవలసిన సేవలు లో భాగంగా వారు పెట్టుకున్న అర్జీలు ఫిర్యాదులపై పి జి ఆర్ ఎస్ వెబ్సైట్ ద్వారా నిత్యం పరిశీలిస్తూ నిర్ణీత సమయంలో పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశిం చారు.

ముఖ్యమంత్రి కార్యాల యం నుండి వారంలో మూడు సార్లు సుదీర్ఘంగా జిల్లా నోడల్ అధికారులతో పి జి ఆర్ ఎస్ కార్యక్రమాల పై సమీక్షలు నిర్వహిస్తు న్నారన్నారు. ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పూర్తిగా విచారించి సమస్యకు సూటిగా పూర్తిస్థాయిలో పరిష్కారం అందించాలని సూచించారు.

ఈ కార్య క్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ సిహెచ్ ఎన్వి కృష్ణారెడ్డి డిపిఓ శాంతి, సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిని పి జ్యోతిలక్ష్మి దేవి, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ దుర్గారావు దొర, డి సి హెచ్ ఎస్ కార్తీక్, జిల్లా వ్యవసాయ అధికారి బోసు బాబు, ఏవో కాశీ విశ్వేశ్వరరావు, డిఐపి ఆర్ఓ కె లక్ష్మీనారాయణ వికాస జిల్లా మేనేజర్ జీ రమేష్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు

Related Articles

ఈనెల 24,27 మధ్య పెను తుఫాన్ హెచ్చరిక జారీ!

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు సెప్టెంబర్ 22: ఈనెల 26న పూరి – వైజాగ్ మధ్య పెను వాయుగుండం లేదా తుఫాను తీరం దాటనుంది. దీని ప్రభావం తో, సెప్టెంబర్ […]

శానపల్లిలంకలో ఉచిత కంటి వైద్య శిబిరాన్నికి విశేష స్పందన

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి అక్టోబర్ 11: శానపల్లిలంక ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కి విశేష స్పందన లభించింది. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ […]

2025: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వెల్త్ మేనేజర్ పోస్టుల భర్తీ.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- ఉద్యోగ అవకాశాలు ఆగస్టు 16: Union Bank of India Recruitment Notification యూనియన్ బ్యాంక్ ఫ్ ఇండియాలో వెల్త్ మేనేజర్ పోస్టుల భర్తీ. […]

అంబాజీపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టూరి ప్రమాణ స్వీకారం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అంబాజీపేట జూలై 17: పి.గన్నవరం అంబాజీపేట: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార […]