V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 20:

స్థానిక డాక్టర్ కోనసీమ జిల్లా అమలాపురం కేంద్రంలో వాహనాల రాకపోకల రద్దీ ని నియంత్రించేందుకు యుద్ధ ప్రాతిపదికన నడిపూడి లాకు వద్ద ఈదరపల్లి వద్ద నూతన వంతెనల నిర్మాణాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రహదారులు భవనాల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. మంగళవారం స్థానిక మండల పరిధి లోని నడిపూడి లాకు వద్ద నూతనంగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పను లను ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల నిర్వహణ తీరుతెన్నులను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నిర్మాణ పనులను వేగవంతం చేస్తూ నిర్దేశిత నాణ్యత ప్రమాణాలను తప్పని సరిగా పాటించాలని సూచించారు. నిర్మా ణ పనులలో ఎటువంటి జాప్యాలకు తావివ్వ రాదని ఆయన స్పష్టం చేశారు నిర్ణీత కాలవ్యవధిలో నిర్మాణ పనులను పూర్తి చేస్తూ ఈ యొక్క వసతులను జిల్లా వాసు లకు అందుబాటులోకి తీసుకొని వస్తూ ట్రాఫిక్ రద్దీని నియంత్రించాలని ఇంజనీర్లను సూచించారు. ఈ కార్యక్రమంలో రహదారు లు భవనాల శాఖ జిల్లా సూపరింటెం డెంట్ ఇంజనీర్ బి రాము డివిజనల్ ఇంజనీర్ వర్మ జూనియర్ ఇంజనీర్ రమేష్ స్థానిక తహసిల్దార్ అశోక్ కుమార్ తదిత రులు పాల్గొన్నారు.