అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమో రియల్ డే

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 18:

అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమో రియల్ డే – 2025 ను పురస్కరించు కొని ఎయి డ్స్ వ్యాధిగ్రస్తులకు కు టుంబాలకు అండగా నిలుస్తామని జిల్లా కుష్టు వ్యాధి ఎయిడ్స్ & టి.బి. నియంత్రణ డాక్టర్ సిహెచ్ వి భరత లక్ష్మి భరోసాను ఇచ్చారు ఆదివారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సెంటర్ నుండి గడియారపు స్తంభం సెంటర్ వరకు సిబ్బంది ఎన్జీవోల సిబ్బందితో ర్యాలీ నిర్వహించి గడి యార స్తంభం సెంటర్ నందు కొవ్వొత్తులు వెలిగించి మానవహారాన్ని నిర్వహించి హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ అంశాలపై ప్రతిజ్ఞ చేయిం చారు “మేము గుర్తించుకుం టాం, మేము మాట్లాడు తాం, మేము నడిపిస్తాం” అనే నినాదంతోఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమో రియల్ డే – 2025 ను నిర్వహించినట్లు ఆమె వెల్లడించారు.

హెచ్.ఐ.వి. తో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని మరియు హెచ్.ఐ.వి. తో జీవిస్తున్న వారికి అండగా నిలుస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ క్యాండి ల్ లైట్ మెమోరియల్ డే – ప్రతీ సంవత్సరo మే నెల మూడో వారంలో జరిపిం చాలని ఆదేశిం చడం జరిగిందన్నారు దీనిలో భాగంగా రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాలు ప్రకారం , జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ వారి ఆదేశాల మేరకు జిల్లా ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్.ఐ.వి.,ఎయిడ్స్ ఆధ్వర్యంలో హెచ్.ఐ.వి. తో మరణించిన వ్యక్తుల వారి కుటుంబాలకు సంఘీ భావo తెలుపు తూ కొవ్వొత్తులను వెలిగించి అంజలి ఘటిస్తూ హెచ్.ఐ.వి. ఎయిడ్స్ పై ఉన్న ఆపోహాలను ప్రజలకు వివరిం చడం జరిగిందన్నారు.

ఎయిడ్స్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిని గౌరవించడానికి, హెచ్ఐవి ఎయిడ్స్తో జీవిస్తున్న వారికి మద్దతును చూపించడానికి, సోకిన వారి పట్ల ఉన్న కళంకాన్ని తగ్గించడానికి సమాజ అవగాహన కొరకు ర్యాలీని నిర్వహించి ఎయిడ్స్ నివారణ అంశాలపై సమా జంలో అవగాహన ను పెంపొందించామన్నారు ప్రతి ఒక్కరూ విలువైన, సురక్షిత మైన వారనే భావించే సమాజాన్ని నిర్మించడానికి అందరం అంకితభావంతో ఉన్నామని,ఎయిడ్స్ పై విజయం సాధించే ప్రపంచం కోసం కృషి చేయడం కొనసాగించడానికి కాంతి ప్రకాశం మనకు స్ఫూర్తినిస్తుం ద న్నారు వివక్షతను ఎదుర్కోవడానికి ఉద్దేశించిన కార్యక్రమమన్నారు.

హెచ్.ఐ.వి. భాధి తులకు వారి కుటుంభాలకు అండగా ఉంటామని ఆమె స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సూపర్వైజర్ శ్రీ. ఎ. బుజ్జి బాబు, ఎ.ఆర్.టి. వైద్యాధికా రులు సిబ్బంది, కోస్టల్ పాజిటివ్ పీపుల్ సిబ్బంది, ఐ.సి.టి. సి. & డి.ఎస్.ఆర్.సి. సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, జన కళ్యాణి వెల్ఫేర్ సొసైటీ సిబ్బంది, జిల్లా టి.బి. సిబ్బంది, జిల్లా ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్.ఐ.వి./ఎయిడ్స్ సిబ్బంది పాల్గొ న్నారు.

Related Articles

డిఆర్ఓ రాజకుమారి అధ్యక్షతన ఎయిడ్స్ నియంత్రణ కమిటీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు వస్తున్నాయి -అమలాపురం జూలై 30: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ చర్య ల అన్ని పారామీటర్లలో నిర్దేశిత […]

ఎస్ యానం బీచ్ లో ఎమ్మెల్యే ఆనందరావు సందడి.

నేరేడుమిల్లి వినయ్ కుమార్.V9 ప్రజాయుధం మీడియా సంస్థ చైర్మన్ మరియు ప్రముఖ ఆన్ లైన్ రిపోర్టర్. V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జనవరి 14: అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల […]

డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రెట్ కు 211 అర్జీలు

నిత్యవసర వస్తువులు రేషన్ షాప్ వాహనాలను కొనసాగించాలి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి నాయకత్వంలో ప్రజా సమస్యలు వేదికలో అమలాపురం కలెక్టరేట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. V9 ప్రజా […]

కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి!డాక్టర్ అంబేద్కర్ ను గౌరవించాలి!అమిత్ షా రాజీనామా చేయాలి!

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – డిసెంబర్ 24: మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి,డాక్టర్ అంబేద్కర్ ను గౌరవించాలి,అమిత్ […]