V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 13:

కష్టపడి చదివిన విద్యార్థినీ విద్యార్థు లకు ఉజ్వల భవిష్యత్తు సొంతం అవుతుందని భవిష్యత్తులో ఉన్నత విద్యాభ్యాసానికి జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిం చి భరోసాగా ఉండి అండగా నిలుస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిషాoతి మెరిట్ విద్యార్థు లకు సూచించారు. బుధవారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ నందు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో అధిక మార్కులు పొందిన విద్యార్థినీ విద్యార్థులను జిల్లా జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా నిఘంటువులు బహుక రించి ఘనంగా సన్మానించారు ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిభా వంతులైన విద్యార్థు లను అభినందించడం చాలా ముఖ్యమని,వారి కృషి, పట్టు దల, అంకితభావానికి ఈ ప్రశంసలు ఒక చిన్న గుర్తిం పుగా నిలుస్తాయన్నారు.

మెరిట్ సాధించిన విద్యా ర్థులందరికీ ఆమె హృదయ పూర్వక అభినందనలు తెలిపారు విద్యార్థుల అద్భుతమైన విజయాలు జిల్లా విద్యా శాఖ పనితీరుకు నిదర్శనమని. ఈ విజయాలు పాఠశాలకే కాకుండా, మీ కుటుంబానికి కూడా గర్వకా రణంగా నిలుస్తారన్నారు. విద్యార్థినీ విద్యార్థులు భవిష్యత్తులో ఏయే ఉన్నత చదువులు అభ్యసించాల నుకుంటున్నారన్న విష యాలను ఆమె అడిగి తెలుసుకున్నారు.మీరు భవిష్యతులో కూడా ఇలాంటి విజయాల పరంపరను ప్రతి దశలో సాధించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు విద్యా ర్థుల కలలు ఆశయాలు సాకారం కావాలని ఆకాంక్షిస్తూ ఆమె శుభాకాంక్షలు తెలిపారు
ఈ విజయం కేవలం విద్యా ర్థుల ఒక్కరిదే కాదనీ. మీకు సహకరించిన మీ తల్లిదం డ్రులు, ఉపాధ్యాయులు శ్రేయోభిలాషులందరికీ కూడా అభినందనలు తెలిపారు.మీ ప్రతిభను విశ్వసించడం ద్వారా విజయం మీ వెంటే ఉంటుందన్నారు. ప్రతి దశలో టాపర్గా నిలవాలని సూచిం చారు కెరీర్ గైడెన్స్ కొరకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించ డం జరుగుతుందన్నారు.

ఐటమ్ 2: రెవెన్యూ జాతీయ రహదారుల అధికారులు సమన్వ యంతో 216 జాతీయ రహదారి నిర్మా ణంలో ఉత్పన్నమైన భూ సమ స్యలను అధిగమించి రోడ్డు నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ నందు జాతీయ రహదారులు రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్ హెచ్ 216 నిర్మాణ పనులు భూసేకరణ అవార్డులు నష్టపరిహారాల చెల్లింపు అంశాల పురోగతిపై సమీ క్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెండింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కార దిశగా ముందడుగు వేయాలని సూచించారు.

అమలాపురం – భట్నవిల్లి రోడ్డు వెంబడి డ్రైనేజ్ నిర్మించాలని సూచించారు. నష్టపరి హారాలను భూ యజ మాన్యాలకు జాప్యాలకు తావు లేకుండా త్వరితగతిన చెల్లించాలని జాతీయ రహదారులు అధికారులకు సూచించారు. రాజోలు మండలంలో ఎన్ హెచ్ 216 మార్గంలో రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు రోడ్డు భద్రత హెచ్చరిక బోర్డులు ఏర్పాటు వంటి భద్రతా చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు
ఈ కార్యక్రమాలలో డిఆర్ఓ రాజకుమారి జాతీయ రహ దారులు అథారిటీ పదక సంచాల కులు సాయి శ్రీనివాస్, అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటరమణ, జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి వనుము సోమ శేఖరరావు డీఈవో షేక్ సలీం భాష, పబ్లిక్ పరీక్షల సూపరింటెండెంట్ హను మంతరావు ఉప విద్యా శాఖ అధికారి జీవివి సుబ్రహ్మణ్యం పిల్లలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
