v9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- రామచంద్రపురం ఏప్రిల్ 21:
నూతన విగ్రహాల ఏర్పాటుకై భూమి పూజ చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్
సమాజంలో అసమానతలు రూపుమాపి, సమ సమాజ స్థాపనకు కృషి చేసిన నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, సంఘ సంస్కర్త, పూర్వ ఉప ప్రధాని, డా.బాబు జగజ్జివన్ రామ్ లు నేటి తరానికి ఆదర్శనీయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం లో సోమవారం వెల్ల గ్రామం అరుంధతి పేటలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఇరువురి మహనీయుల విగ్రహాల నిర్మాణానికి సంబంధించి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ మాసం మహనీయులకు పుట్టింది పేరని, బాబు జగజ్జివన్ రామ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే వంటి మహనీయులు ఏప్రిల్ లోనే జన్మించారని గుర్తు చేశారు. ఆ మహనీయులు చేసిన త్యాగాల వల్లే సమాజంలో వివక్ష, అసమానతలు నిర్మూలించబడ్డాయని అన్నారు. ఆ మహనీయులను స్మరణకు తెచ్చుకుని వారి బాటలో సాగిపోవాలని సూచించారు. డాక్టర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల స్థాపనకు తన చేతుల మీదుగా భూమి పూజ చేయడం తన అదృష్టమన్నారు మంత్రి సుభాష్. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీరబోయిన సూరిబాబు, ఆకుల నారాయణరావు, ఎస్ ఎల్ టి అధినేత దూడల శ్రీనివాస్, దడాల నాగభూషణం, ఏసుబాబు, ఆకుల సతీష్, కొమిరెడ్డి రాముడు, లంక మహేష్, సురేష్, పట్టాభి ఎన్డీఏ కూటమి నాయకులు, వెల్ల గ్రామ దళిత సంఘాల నేతలు వసంతరావు తదితరులు పాల్గొన్నారు.