దోమల నియంత్రణ ద్వారానే డెంగ్యూ వ్యాధిని ఆరికట్ట గలుగుతామం అధికారులు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 16:

దోమల నియంత్రణ ద్వారానే డెంగ్యూ వ్యాధిని ఆరికట్ట గలుగుతామని అధికారులు, ప్రజల భాగ స్వామ్యంతోనే దోమల నివారణ చర్యలు చేపట్టి ప్రాణాంతక డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దుర్గారావు దొర అన్నారు. మంగళవారం జాతీయ డెంగ్యూ దినోత్స వాన్ని పురస్కరించుకొని డెంగ్యూ వ్యాధి నివారణ ర్యాలీని స్థానిక మున్సిప ల్ కార్యా లయం నుండి గడి యారపు స్తంభం సెంటర్ వరకు డెంగ్యూ నివారణ అంశాల నినాదాలతో నిర్వ హించారు దోమల నియం త్రణ ద్వారానే డెంగ్యూ వ్యాధిని ఆరికట్టగలుగు తామన్నారు. దోమల నివారణ పట్ల ప్రజలలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు డెంగ్యూ వ్యాధి లక్ష ణాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా సంబంధిత అధికారులు విసృత ప్రచారం కల్పించాలన్నారు.

డెంగ్యూ మలేరియా వంటి వ్యా ధులు దోమల ద్వారా సంక్రమిస్తాయని, డెంగ్యూ వ్యాధి దోమ కాటు ద్వారా సంక్రమిస్తుం దని దోమలు వ్యాప్తిచెంద కుండా తగు జాగ్రత్తలు తీసుకోనేలా ప్రజలను చైతన్య వంతు లను చేయాలన్నారు. ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువైన దోమల ద్వారా మలెరీయా ఫైలేరియా డెంగీ, చికున్ గున్యా, మెదడు వాపు, వంటి వ్యాధులు వ్యాప్తిస్థాయ న్నారు. నివాస పరిసరాల ప్రాంతాలలో సాధారణం గా ఆనాఫిలస్, క్యూలెక్స్, తదితర రకాల దోమలు వ్యాప్తి చెందుతాయన్నా రు. డెంగ్యూ వ్యాధిని వ్యాప్తిచేసే ఆడ దోమ ఉదయం, సాయంత్ర వేళల్లో చెమట పట్టే శరీర భాగాలపై కుట్టి రక్తాన్ని పీల్చు కొని నిల్వ ఉన్న నీటి పై గుడ్లను పెట్టి సంతానోత్పత్తి చేసుకొంటా యన్నారు.

ప్రజలు ఉద యం సాయంత్రం వేళల్లో కిటికీలను మూసి ఉంచు కోవడం ద్వారా దోమలు ఇంట్లోకి ప్రవేశిం చకుండా చూచుకోవాల న్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవా లన్నారు. నిల్వ ఉన్న నీటిలో మాత్రమే డెంగ్యూ దోమలు సంతానోత్పత్తి చేసేందుకు అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఇంటిలో ఆరుబయట నీటి నిల్వలు లేకుండా పొడిగా ఉండేలా జాగ్ర త్తలు తీసుకోవడం ద్వారా డెంగ్యూ వ్యాధిని అరిక ట్టేందుకు అవకాశాలు ఉంటాయన్నారు.అధిక జ్వరం, తలనొప్పి, కంటి వెనుక భాగంలో నొప్పి, కండరాల నొప్పి, చర్మంపై గుండ్రటి మచ్చలు వంటి లక్షణాలు ఉన్న వారికి వెంటనే డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలన్నారు.

డెంగ్యూ పరీక్షలను ప్రైవేట్ ఆసుపత్రులలో కాకుండా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గల ప్రత్యేక ల్యాబ్ ద్వారా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాల న్నారు. పట్టణంలో మురుగు కాలువలు వలన దోమల బెడద ఎక్కువగా ఉంటుందని పట్టణంలో పారిశుధ్య అధికారుల సమన్వయం తో ఎప్పటి కప్పుడు కాలువలను శుభ్రపరచి మురుగునీటి నిల్వలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాల న్నారు. యాంటీ లార్వా ఆపరేషన్ ప్రక్రియను ప్రతి సచివాలయం వరకు అనుసంధానించాల న్నారు. అధికారులు ప్రజలు స్థానిక ప్రజా ప్రతినిధులు బాగస్వా మ్యంతో దోమల రహిత పట్టణoగా తీర్చిదిద్ది డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల న్నారు. జూన్, జూలై మాసాలలో వర్షాలు పడే సమయంలో వర్షపు నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పూల కుండీలు, ఖాళీ డబ్బాలు, కొబ్బరి డొక్కలు ప్లాస్టిక్ సీసాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకో వాలన్నారు. దోమల నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలకు
ప్రజల సహకారం కూడా అవసరమన్నారు జిల్లా మలేరియా అధికారి వెంక టేశ్వరరావుమాట్లాడుతూ
దోమ కాటు వల్ల సంక్ర మించే డెంగ్యూ వైరల్ ను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరం గా చివరకు ప్రాణాంతకo గా కూడా మారుతుందని. 4 రకాల డెంగ్యూ వ్యా ధుల కట్టడి చేయడానికి దోమలు పెరగకుండా పరిసరాల పరిశుభ్రతను పాటించడమే. ఏకైక ఉత్తమ మార్గమని ప్రతి ఒక్కరు గ్రహించాలన్నారు డెంగ్యూ వ్యాధికి, చికిత్స ఉన్నప్పటికీ అశ్రద్ధ చేస్తే ప్రమాదకరంగా మారి ప్రాణాలను కూడా తీస్తుం దని పౌర సమాజం అర్థం చేసుకోవాలన్నారు.

డెంగ్యూ వ్యాధి ముఖ్య లక్షణ లక్షణాల్లో అధిక జ్వరం తీవ్ర తలనొప్పి, నేత్రాల వెనుక నొప్పి, కండరాలు కీళ్ల నొప్పులు, వాంతులు,అలసట, శారీరక బలహీనత, చర్మంపై దద్దుర్లు, బిపి తగ్గడం, ప్లేట్ల సంఖ్య పడిపోవడం లాంటివి కనిపిస్తాయన్నారు
ప్రమాదకర ప్రజారోగ్య సమస్యగా మారిన డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించటానికి జాతీయ డెంగ్యూ దినం నిర్వహిం చడం ఆనవాయితీగా మారిందన్నారు. ప్రభుత్వ వైద్య ఆరోగ్య యంత్రాం గం పాత్ర, వైద్య సిబ్బంది అంకిత భావం, వ్యాధి పట్ల ప్రజలకు కనీస అవగాహన కల్పించాల న్నారు, మున్సిపల్ కమిషనర్ కెవిఆర్ రాజు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తూ ప్రజా రో గ్య వ్యవస్థలను బలోపే తం చేయడం. పౌర సమాజాన్ని ఏకీకృతం చేయడం లాంటి లక్ష్యా లను చేపట్టడానికి జాతీయ డెంగ్యూ దిన వేదికలను నిర్వహించా మన్నారు ఈ ఏడాది ప్రారంభంలోనే “డెంగ్యూ నివారణ పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యకర జీవన విధానం” అనబడే ఇతివృత్తాన్ని అంశాన్ని తీసుకొని ప్రచారం చేప ట్టామన్నారు.ప్రజలలో అవగాహన లేమి వాతా వరణ ప్రతికూల మార్పు లు, వర్షాకాల ఆపరిశుభ్ర తలు డెంగ్యూ లాంటి సంక్రమిత వ్యాధులకు తలుపులు తెరుస్తున్నట్లు అవుతుందన్నారు సరైన సమయంలో స్పందిస్తూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పౌర సమాజంలో చైతన్యం తగు రీతిలో కొనసాగితే డెంగ్యూ వ్యాధి కట్టడి సులభం అవుతుందన్నారు. స్వల్ప ఆశ్రద్ద ప్రాణాంతకం కావచ్చునని ఇంటి పరిసరాల పరిశుభ్రత కుటుంబ సమాజ ఆరోగ్య ప్రదాయిని అని తెలుసు కొని వ్యాధి చికిత్స కన్న నివారణ మిన్న అనే నినా దాన్ని గుర్తుంచుకొని మన ఆరోగ్యం కోసం మనమే ప్రతినభూనాలన్నారు.తొలుత మున్సిపల్ కార్యాలయం వద్ద జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎం దుర్గారావు దొర ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీ లో రెడ్డి సత్య నాగేంద్ర మణి ,మహిళా ఆరోగ్య కార్యక ర్తలు , ఆశా కార్యకర్తలు, మలేరియా ఫైలేరియా సిబ్బంది ప్లకార్డులు పట్టుకుని మున్సిపల్ కార్యాలయం వద్ద డెంగ్యూ వ్యాధి అంతం మన పంతం అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్ర మంలో ప్రభుత్వ వైద్యాధి కారులు ఎం ఎం మణిదీప్, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్లు ఎన్ వి రామారావు, ఎస్ రాజబాబు , ఫైలేరియా సూపర్వైజర్ ఎస్ సత్య నారాయణ, హెల్త్ విజిటర్ ఏ లక్ష్మి, జిల్లా మలేరియా ఆఫీస్ సిబ్బంది వై ఆదినారా యణ, ఏ ఆర్ ఎల్ నాగరాజు ,రవి పాల్గొన్నారు

Related Articles

రేపు లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు

రేపు లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లులోక్‌సభలో ప్రవేశపెట్టనున్న అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్బిల్లు ఆమోదానికి కావాల్సిన 361 మంది ఎంపీల మద్దతుఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతు ఇండియా కూటమికి 235 మంది ఎంపీల బలం

ఎమ్మార్వో అశోక్ కుమార్ ముందు హాజరు పరిచిన బెల్ట్ షాప్ లు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం ఏప్రిల్ 04: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం పరిధిలో ఉన్న ముగ్గురు బెల్ట్ షాప్ నిర్వాహకులను అరెస్ట్ […]

ఉద్యోగులు సమస్యలకు ఉంది మీకోసంరెవెన్యూ కేర్ ఓపెన్ హౌస్ గ్రీవెన్స్ !

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 19: ఉద్యోగుల విధులు నిర్వహణ కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి అన్ని విధాల సహకారం అందించడం జరుగుతుందని డాక్టర్ బి ఆర్ […]

కొండుకుదురు గ్రామంలో గ్రామ రెవెన్యూ సదస్సు .

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామంలో బుధవారం గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ రెవెన్యూ సదస్సు కు తహశీల్దార్ నాగలక్ష్మిమ్మ హాజరైయ్యారు.ఆమె […]