వ్యాయామం మానసిక ఆరోగ్యానికి ప్రయోజనం:ఒంటెద్దు వెంకన్న నాయుడు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి మార్చి ఆదివారం 23:
వ్యాయామం వల్ల మానసిక ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ఉంది అని ఒంటెద్దు వెంకన్న నాయుడు పేర్కొన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరం మెయిన్ కూడలి దగ్గరలో రారాజు జిమ్ ను ఆదివారం సాయంత్రం నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైసిపి నాయకులు ఒంటెద్దు వెంకన్న నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జిమ్ హాలు కు ఉన్న రిబ్బన్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా వెంకన్న నాయుడు మాట్లాడుతూ..జిమ్‌లో వ్యాయామం చేయడం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి, ఉదాహరణకు బరువు తగ్గడం, కండరాలను బలోపేతం చేసుకోవడం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం, ఒత్తిడిని తగ్గించడం, మరియు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు రారాజు జిమ్ ను ఆరోగ్యం కోసం ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. అయినవిల్లి జడ్పిటిసి మరియు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు, యనుముల పద్మరాజు, గారపాటి చంద్రశేఖర్, మద్దా చంటిబాబు, కంకిపాడు వెంకటేశ్వరరావు, మరియు తదితరులు రారాజు జిమ్ ప్రారంభోత్సవము లో పాల్గొన్నారు.