V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి ఫిబ్రవరి 23:

ప్రతి ఇంటికి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందించే విధానాన్ని అలవాటు చేయాలని సర్పంచ్ కాశి సూచించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మాగం గ్రామంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం వద్ద సచివాలయ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా తడి చెత్తను వరిమెగా తయారు చేసే విధానాన్ని వివరించారు. రాబోయే రోజుల్లో గ్రామాన్ని జిల్లాలోనే మోడల్‌గా తీర్చిదిద్దేలా సచివాలయ సిబ్బంది పనిచేయాలని సర్పంచ్ మరియు సీనియర్ ఫోటోగ్రాఫర్ కాశీ వీర వెంకట సత్యనారాయణ మాట్లాడారు. మన మాగం గ్రామాన్ని అన్ని విధాలుగా మోడల్‌గా తయారు చేసేందుకు సిబ్బంది సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి భవాని, డ్వాక్రా మహిళా సంఘాలు, మరియు పంచాయితీ, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.