
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్
వార్తలు -అమలాపురం డిసెంబర్ 24:కోనసీమ జిల్లాలోని విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు మాదకద్రవ్యా ల అలవాటుకు బానిసలు కాకుండా పటిష్టమైన నిఘా వ్యవస్థను అమలు పరచాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,కలెక్టరేట్ నందు. మాదక ద్రవ్యాలు గంజాయి వాడ కం నిరోధంపై జిల్లాస్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం అదో తప్పు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ విద్యార్థులు, యువతను సన్మార్గంలో నడిపి, వారిలో వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపర్చి, ఉన్నత లక్ష్యాలను చేరుకునే దిశగా ప్రోత్సహించాలన్నారు నేడు సమాజం ఎదుర్కొంటున్న సమస్య ల్లో యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మా రడమన్నది ప్రధాన సమస్యగా మారిందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన యువత ఏవిధంగా చెడిపో తున్నారో వివరించి, వారిని తిరిగి సన్మార్గంలో నడిపేందు కు జిల్లా పోలీసుశాఖ చర్యలు చేపట్టిందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం యువత పై ఏవిధంగా చెడు ప్రభా వాన్ని చూపివారి జీవి తాలను, కుటుంబాలను ఏవిధంగా అస్తవ్యస్తం చేస్తున్నదన్న విషయాలు సులువుగా అర్ధమయ్యే విధంగా పోస్టర్లు, పాంప్లెట్లు, బ్యానర్లు సంబంధిత స్కూల్ మరియు కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేయాలన్నారు. విద్యావ్యవస్థలలో ఎన్సిసి విద్యార్థులు టీచర్లతో క్లబ్బులు ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ మాదక ద్రవ్యాలు నిరోధక కమిటీ దృష్టికి వచ్చినట్లయితే వెంటనే సంబంధిత స్టేషన్ హౌస్ అధికారి కమిటీకి నివేదించి నివారణ చర్యలను బలోపే తం చేయాలన్నారు. ప్రతి నెల ఒక గంట పాటు మాదక ద్రవ్యాల నియంత్ర ణపై సమావేశం నిర్వహించి 30 నిమిషాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 30 నిమిషాలు నిరోధక అంశాలపై అవగా హన కల్పించాలన్నారు.చిన్న వీడియోలను ప్రదర్శించా లన్నారు అదే విధంగా మత్తు పదార్థాలు వలన యువత శరీరం, నాడీ వ్యవస్థపై దుష్ప్రభావాన్ని ఏవిధంగా చేస్తుందో పవర్ పాయింట్ ప్రజెంటేషనుతో వివరించి, యువతలో చైతన్యం తీసుకొని వచ్చేందుకు చర్య లు గైకొనాలన్నారు. జిల్లా ఎస్పీ బి కృష్ణారావు మాట్లా డుతూ విద్యాసంస్థ లవారీగా క్లబ్బులు కమిటీలను ఏర్పాటు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్స్ బలపరచాలని గంజాయి అమ్మే వాళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారిని సమీప ఆసుపత్రులలో డీఎడిక్షన్ కేంద్రాల ద్వారా సక్రమంగా పరివర్తన చెందే విధంగా ప్రయత్నించాలన్నారు యువత ఒకసారి డ్రగ్స్ ను వినియోగిస్తే ఏమీ కాదన్న భ్రమలో ఉంటారని, కాని డ్రగ్స్ ఒకసారి వినియోగించిన తరువాత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడానికి ఎంతో సమయం పట్టద న్నారు. తోటి స్నేహితులు ప్రోద్భలం తోనో, డ్రగ్స్ తీసుకొంటే ఏవిధమైన ఆనందాన్ని అనుభూతిని పొంద వచ్చునో తెలుసు కోవాలన్న ఆసక్తి, స్నేహితులు హేళన చేస్తారనో, చుల కనగా చూస్తారన్న భావనతోను వారి ఒత్తిడికి తలొగ్గి, మాదక ద్ర వ్యాలను సేవించడం, వాటికి అలవాటువడి, చివరకు బానిసలుగా మారుతారన్న వాస్తవాన్ని యువత గుర్తించ లేకున్నారన్నారు. గంజాయి అక్రమ రవాణా మరియు సేవించే వారి పట్ల జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతూ ఇంటిలిజెన్స్ సమాచారంతో శాఖల స మన్వయంతో మాదకద్రవ్యాల నిరోధక చర్యల ద్వారా విద్యా ర్థుల ఉజ్వల భవిష్యత్తు కు మార్గం సుగమం చేయడం జరుగుతుంద న్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో షేక్ సలీం బాషా డిఆర్డిఏ పిడి శివశంకర్ ప్రసాద్ ఏపీ డి రాంబాబు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ తదితరులు పాల్గొ న్నారు