


V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 18:

మాల మహానాడు నాయకుడు గిడ్ల వెంకటేశ్వరరావు ను జర్నలిస్ట్ వినయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం “ముక్తేశ్వరం” అయినవిల్లి గ్రామానికి చెందిన సీనియర్ మాలమహానాడు నాయకుడు గిడ్ల వెంకటేశ్వరరావు ను ప్రజా ఆయుధం దినపత్రిక ఎడిటర్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ శుక్రవారం మీడియా తరఫున మర్యాదపూర్వకంగా కలిసారు. ప్రతి గ్రామానికి ప్రజా ఆయుధం దినపత్రిక అందించే విధంగా రూపొందుతున్న న్యూస్ ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు కు సంబంధించిన విషయాలను జర్నలిస్టు వినయ్ కుమార్, అయినవిల్లి మండలం మాల మహానాడు అధ్యక్షుడు గిడ్డి వెంకటేశ్వరరావు తో పంచుకున్నారు. ముందుగా గౌరవార్థం గా పూల మొక్క ఇచ్చి జై భీమ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా ఆయుధం మీడియాకు తన వంతు కృషి చేస్తానని మాట ఇచ్చారు. ఆయనకు వినయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.