V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి మార్చి 08:

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మాగం గ్రామ పంచాయతీ సర్పంచ్ కాశి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ కాశి మాట్లాడుతూ… సమాజం నిర్మాణములో సగభాగం స్త్రీ అని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలో మహిళలకు మంచి గౌరవం దక్కే విధంగా రాజ్యాంగం లో రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పొందుపరచడం దేశానికే శుభ పరిమళం అన్నారు. మనమందరం చరిత్రలోనికి వెళితే స్త్రీని ఒక బానిసగా చూస్తూ..బాల్య వివాహాలు, సతీసహగమనం, ఇలాంటి ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు స్త్రీపై వేసి ఆమెను ఒక ఆట బోమ్మగా చూసేవారన్నారు. అలాంటి సందర్భాలలో డాక్టర్ అంబేద్కర్ మహిళలకు హక్కులు కల్పించి, వారికి గొప్ప ధైర్యాన్ని కల్పించారు.

మేము కూడా సమాజంలో సగభాగం మే అనే విధంగా మహిళలను తీర్చిదిద్దారు అంటే గొప్ప విషయం అని సర్పంచ్ కాశి మాట్లాడారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్ వడగన వెంకటలక్ష్మి కు ఘనంగా కూటమి నాయకులు సమక్షంలో సన్మానం జరిగించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భవాని, కూటమి నాయకులు అడ్డగల రాంబాబు, అత్తిలి రాంబాబు, కొమ్మిరెడ్డి శివ, రైతు భరోసా అధికారి సుధా, ఏఎన్ఎం మంగాదేవి, ఆశా వర్కర్ ఈరెళ్ల దుర్గ, డ్వాక్రా యానమేటర్లు, మరియు పంచాయతీ సిబ్బంది వార్డు మెంబర్లు , తదితరులు పాల్గొన్నారు.
