పేరాబత్తుల గెలుపు ప్రజా విజయం. కృషిచేసిన కూటమి నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలుఎమ్మెల్యే వేగుళ్ళ

ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట మార్చి 04: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి గా పోటీచేసిన పేరాబత్తుల రాజశేఖరం అత్యధిక మెజారిటీతో గెలుపొందటం ముమ్మాటికి ప్రజా విజయం అని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మరియు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. ఎ.పి అసెంబ్లి సమావేశాలలో ఉన్న ఆయన మంగళవారం అమరావతి నుండి మీడియాతో ఫోన్లో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పై ప్రజలకున్న నమ్మకం, విశ్వాసానికి నిదర్శనం పేరాబత్తుల గెలుపన్నారు. పట్టభద్రుల నమ్మకాన్ని పేరాబత్తుల రాజశేఖరం నిలబెట్టుకుంటారన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ఆయన అంకితభావంతో పనిచేస్తారన్నారు. పేరాబత్తుల విజయానికి కృషిచేసిన బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు పేరుపేరునా ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు.

Related Articles

హైదరాబాద్‌లో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ బృందం పర్యటన

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం కలెక్టరేట్ సెప్టెంబర్ 04: కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కె సీఎం) ను మరింత బలోపేతం చేయడం, వలస కార్మికులకు సంబంధించిన సమస్యల […]

అమలాపురం కిమ్స్ ఆసుపత్రి ఆవరణలో యోగాంధ్రా/ పాల్గొన్న ఎంపీ హరీష్

యోగాంధ్రా తో ప్రపంచం చూపు ఆంధ్రా వైపు… మార్క్ పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిట్టా : ఎంపీ హరీష్ బాలయోగి V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 21: […]

జూన్ 12న పాఠశాలలు ప్రారంభానికి ముందుగా సంసిద్ధత చర్యలు – ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జూన్ 06: జూన్ 12న పాఠశాలలు ప్రారంభానికి ముందుగా సంసిద్ధత చర్యలు – ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలు […]

సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ, రేషన్ పంపిణీ, దీపం 2, మూడు ఉచిత సిలిండర్లు పంపిణీ,గ్యాస్ డోర్ డెలివరీ,

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 10: సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ, రేషన్ పంపిణీ, దీపం 2, మూడు ఉచిత సిలిండర్లు పంపిణీ,గ్యాస్ డోర్ డెలివరీ, ఆసుపత్రి […]