ప్రజల నుండి అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కార మార్గాలు నూటికి నూరు శాతం చూపాలి జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం ఆగస్టు 18:

ప్రజల నుండి అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కార మార్గాలు నూటికి నూరు శాతం చూపాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారుల నుండి సుమారుగా 135 అర్జీలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ టీ నిశాంతి, డిఆర్ఓ కే మాధవి లు స్వీకరించారు.

ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అందిన ఆర్జీలను నిర్ణీత గడువు లోగా పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదుదారుల విజ్ఞప్తు లను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయా లన్నారు.

అర్జీల పెండింగు గడువు దాటిన అర్జీలు లేకుండా రీఓపెనింగ్ ఆస్కారం లేకుండా అర్జీదారుల పూర్తిగా సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. ప్రజా సమ స్యల పరిష్కర వేదికకు వచ్చే వినతులను అధికా రులు ఎప్పటికప్పుడు లాగిన్లో పరిశీలించి పరిష్క రించాలన్నారు. రీఓపెన్ కేసులను కూడా పూర్తిగా విచారణ జరిపి ముగించాలని, గడువులోగా వినతులకు సమాదానాలు పంపాలని అధికారులను ఆదేశించారు.

అర్జీల పరిష్కారంలో జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరిం చాలన్నారు.ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు నుండి ఫిర్యాదులను స్వీకరిం చడం జరిగిందన్నారు. ఫిర్యా దులు పరిష్కారంలో సంబంధిత శాఖల అధికారులు లాగిన్ లో పూర్తిస్థాయిలో పరిజ్ఞానాన్ని అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు. అర్జీదార్ల సమస్యల పరి ష్కారంలో క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలన చేయాలన్నారు.

మండల, డివిజన్ స్థాయిలో స్వీకరించ బడిన ఫిర్యాదుల పరిష్కారంలో సరైన జవాబుదారితనంతో ఉండాలన్నారు. పరిష్కరించిన అనంతరం సంబంధిత జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చి వారు దృవీక రించబడిన అనం తరం ఫిర్యాదులను ముగించా లని అధికారులకు సూచిం చారు. అలా చేయడం వలన సంబంధిత శాఖల అధికారులకు మండల స్థాయిలో జరిగే ఫిర్యా దులపై పూర్తి అవగాహన, వారు ఇచ్చిన ఎండాస్మెంటుపై స్పష్టత తెలుస్తుందన్నారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అర్జీ ల పరిష్కారంలో నాణ్యత కనబరచాలన్నారు. అర్జీలు రీఓపెన్ లేకుండా శ్రద్ద వహిం చాలన్నారు. అర్జీల పరి ష్కారంలో ఎటువంటి అలసత్వం వహించిన సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పిడి మధుసూదన్, డీఎస్ఓ ఏ ఉదయ భాస్కర్, ఎస్ డి సి పి కృష్ణమూర్తి, డి ఎల్ డి వో రాజేశ్వరరావు జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో జూన్ 6 నుంచి జూన్ 30 వరకు డీఎస్సీ పరీక్షలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు ఏఅమలాపురం/కాట్రేనికోన జూన్ 5 ,2025 ప్రశాంత వాతావరణంలో డీఎస్సీ పరీక్షలను నిర్వహించాలి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో జూన్ 6 […]

ఎపి కి 2 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు

విశాఖలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పర్యటించారు.కొత్త RTC బస్సులు ప్రారంభించిన రాంప్రసాద్‌రెడ్డి, మాట్లాడుతూ..త్వరలో ఏపీకి ఆర్టీసీలోకి 1400 కొత్త బస్సులు తెస్తున్నాం అన్నారు.2 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు తెచ్చే యోచనతో ముందుకి వెళ్తున్నాం తెలిపారు.కొత్త బస్సులతో […]

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇకలేరు

మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక ఇప్పటికే ప్రియాంకా గాంధీ ఆసుపత్రికి […]

కలెక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో DRO రాజకుమారి పదవి విరమణ సన్మాన వీడ్కోలు సభ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 31: సుమారుగా 43 న్నర సంవత్సరాల పాటు ఎంతో ప్రాముఖ్యత కలిగిన రెవెన్యూ విభాగంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పలువురు మన్ననలు […]