V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి ఫిబ్రవరి 20: మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన వారికి 99, వేలు జరిమానా విధిస్తారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధవారం మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ 9 మంది అయినవిల్లి ఎస్సై జోష్ కుమార్ కు చిక్కారు. అనంతరం కేసు నమోదు చేసి అమలాపురం కోర్టులో హాజరు పరిచగా. మెజిస్ట్రేట్ 9 మందికి 11,000 చొప్పున 99 వేలు జరిమానా విధిస్తూ ఫైల్ క్లోజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై జోష్ కుమార్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, మండలం లోని ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలను తప్పక పాటించాలని లేదా భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అయినవిల్లి సబ్ ఇన్స్పెక్టర్ జోస్ కుమార్ తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరం, ఇది మీ ప్రాణాలకు, ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తుంది. మద్యం సేవించిన వ్యక్తి డ్రైవింగ్ చేయడం పై సెక్షన్ 185 క్రింద మొదటి సారి నేరం చేస్తే రూ. 10,000 జరిమానా, లేదా 6 నెలలు జైలు శిక్ష విధించవచ్చు, రెండోసారి నేరం చేస్తే రూ.15,000 లేదా 3 సం.ల జైలు శిక్ష, లేదా రెండును విధించవచ్చని తెలిపారు. వాహనం నడిపే సమయంలో వాహనదారులు రోడ్డు భద్రతా మరియు రహదారి నిబంధనలు తప్పక పాటించి ప్రమాదాలు, జరిమానాలు, శిక్షలకు గురి కాకుండా ఉండాలని ఎస్సై కోరారు.
మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే 99, వేలు జరిమానా!
February 20, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
శ్రామిక హక్కుల పోరాట యోధుడు మచ్చా నాగయ్య
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అయినవిల్లి /అమలాపురం ఆగస్టు 06: కష్టజీవులు శ్రామికుల హక్కులకై పోరాడిన ఉద్యమకారుడు కామ్రేడ్ మచ్చ నాగయ్య అని ఆయన మరణం పేద బడుగు బలహీన వర్గాల […]
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై అపోహలొద్దు/ఏపీఈపీడీసీఎల్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు వస్తున్నాయి -డాక్టర్ బీ ఆర్ అంబెడ్కర్ కోనసీమ, జూలై 23 : విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపుపై ఎటువంటి అపోహలు అవసరం లేదని, వీటి […]
చెన్నై రైల్వే స్టేషన్ లో చిక్కుకుపోయిన కుటుంబాన్ని కాపాడిన జాయింట్ కలెక్టర్
మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాంతి ఐఏఎస్ V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 06: చెన్నై రైల్వే స్టేషన్లో చిక్కుకుపోయిన కుటుంబాన్ని కాపాడిన […]
ఆరోగ్యశ్రీలో కీలక మార్పులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ ప్రణాళిక నిర్వహణలో కొన్ని కీలక మార్పులు తీసుకొస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల నిర్వహించిన సమావేశంలో పలు మార్పులపై చర్చ జరిగింది. ముఖ్యంగా ఆయన ఆరోగ్య శ్రీ సేవల […]