అపార అనుభవశాలి దామోదరం సంజీవయ్య :జాయింట్ కలెక్టర్ టి నిషాంతి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ -అమలాపురం ఫిబ్రవరి 14:

అపార అనుభవశాలి దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రెండవ ము ఖ్యమంత్రిగా, తొలి దళిత ముఖ్యమంత్రి పనిచేశారని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి పేర్కొన్నారు.శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నందు దామోదరం సంజీవయ్య 104 వ జయంతి వేడు కలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంజీవ య్య ఆశయాలను స్ఫూర్తిగా ఆదర్శంగాగా తీసుకొని త్రికరణ శుద్ధిగా ఆచరించడమే ఆయనకు అర్పించే ఘనమైన నివా ళి అన్నారు సంయుక్త మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర ప్రభు త్వంలో అనేక సార్లు ఆయన మంత్రి పదవులు నిర్వహించగా, రెండు సార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షు లుగా పనిచేసిన ప్రత్యేకత ఆయనదన్నారు.38 ఏళ్ల చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే ద క్కిందన్నారు . వివిధ శాఖల్లో మంత్రిగా పని చేసిన గొప్ప రాజకీ యవేత్త, అపార అనుభ వశిలి. స్నేహశీలి, సౌమ్యు డు, సాహితీ వేత్త, ఆదర్శ ప్రాయుడు, చిరస్మరణీ యుడు దామోదరం సంజీవయ్య అన్నారు రామోదరం సంజీవయ్య పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వంలో తెలుగు భాష వాడుక అధికం చేయడం, భూసంస్కర ణల అమలు వంటి ఎన్నో నిర్మాణాత్మక కార్యక్రమా లు ఆయన హయాంలో చేపట్టారన్నారు. దళిత నిరుపేద కుటుంబంలో పుట్టినా పట్టుదలే పెట్టుబడిగా లా డిగ్రీని సాధించాడన్నారు. లా అప్రెంటీసు చేస్తున్న సమయoలో వివిధ రాజకీయ నాయకుల పరిచయo, సాంగత్యo వలన రాజకీయాల లో ప్రవేశించాలనే ఆసక్తి కలిగినదన్నారు. సంజీవయ్య మంచివక్తని తెలుగు లోనూ, ఇంగ్లీషు లోనూ ధారాళంగా మాట్లాడేవారన్నారు టంగుటూరి ప్రకాశం వంతులు మంత్రి వర్గo లో ఆరోగ్యశాఖా మంత్రిగా ఉండగానే పాఠశాల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న కృష్ణ వేణిని సంజీవయ్య పెద్దలు కుదిర్చిన వివాహం చేసు కున్నాడన్నారు. సంజీవయ్య లేబర్ ప్రాబ్లమ్స్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించారన్నారు. 1967 లో ఎన్నికల ప్రచార సమయములో విజయవాడ నుండి హైదరాబాదుకు వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారని. ఆ ప్రమాదం నుంచి పూర్తిగా ఎన్నటికి కోలుకో లేకపోయారని 1972 మే 7 వ తేదీన ఢిల్లీలో గుండె పోటుతో మరణించారన్నారు. ఆయన స్మారకార్థం పాటి గడ్డ సమీపాన ఉద్యాన పార్కును అభివృద్ధి చేసి ఆయన పేరు మీదుగా సంజీవయ్య పార్కు అని పేరు పెట్టారన్నారన్నారు.. 2008 లో విశాఖప ట్నంలో స్థాపితమైన ఆంధ్ర ప్రదేశ్ నేషనల్ లా యూనివర్సిటీకి ఆయన జ్ఞాపకార్ధం 2012 లో దా మోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీగా నామకరణం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు పి శ్రీకర్, డి అఖిల, ఏవో విశ్వేశ్వరరావు, సెక్షన్ సూపరింటెండెంట్లు మురళీకృష్ణ రమణ కుమారి ఎల్డిఎం కేశవ వర్మ, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి పి జ్యోతిలక్ష్మి దేవి వికాస జిల్లా మేనేజర్ జి రమేష్ కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

కాశ్మీర్ లోని పహల్గాం ఉగ్ర దాడులను అన్ని దేశాలు ఖండించాయి: హరీష్ బాలయోగి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 17: అఖిల పక్ష బృందాలు వెళ్లిన అన్ని దేశాలు భారతదేశానికి మద్దతు తెలిపాయి… పాత్రికేయ సమావేశంలో వెల్లడించిన ఎంపీ హరీష్ బాలయోగి… […]

70 వేలు ఎకరాలలో రొయ్యల చెరువులు (E H P) తెగుళ్లు సోకి నష్టపోయిన రైతులు కొరకు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం సెప్టెంబర్ 19: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో సుమారు 70 వేలు ఎకరాలలో తెగుళ్లు సోకి రొయ్యల పంట దెబ్బ తిన్నదని వార్తలు […]

అమర జీవిగా పొట్టి శ్రీరాములు: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం డిసెంబర్ 15: భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి నాంది పలికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కై ఆమరణ నిరాహార దీక్ష నిర్వహించి ప్రాణత్యాగం, […]

కొండుకుదురు గ్రామంలో గ్రామ రెవెన్యూ సదస్సు .

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామంలో బుధవారం గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ రెవెన్యూ సదస్సు కు తహశీల్దార్ నాగలక్ష్మిమ్మ హాజరైయ్యారు.ఆమె […]