V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట ఫిబ్రవరి06: మండపేట లో వైసిపి బలోపేతం కు కృషి చేస్తానని నియోజకవర్గ యువజన విభాగం కన్వీనర్ చోడే శ్రీకృష్ణ పేర్కొన్నారు.వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ యువజన విభాగం కన్వీనర్‌గా పట్టణానికి చెందిన చోడే శ్రీకృష్ణ నియమితులయ్యారు. ఈమేరకు తాడేపల్లి నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. నియోజకవర్గ యువతలో మంచి పట్టున్న శ్రీకృష్ణ గతంలో విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకునిగా పార్టీకి సేవలందించారు. పార్టీ కార్యక్రమాల్లో తన అనుచరులతో కలిసి చురుగ్గా పనిచేస్తుంటారు. ఆయన సేవలకు గాను యువజన విభాగం నియోజకవర్గ కన్వీనర్‌గా పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక బాద్యతలు అప్పగించారు. తన నియామకం పట్ల జగన్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు శ్రీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషిచేస్తానన్నారు.
వైఎస్సార్‌సీపీ యువజన విభాగం కన్వీనర్‌గా శ్రీకృష్ణ
February 6, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
కోడి పందాలు సంప్రదాయమా ! ఇది న్యాయమా! మేధావులు నోటి మాట.
కోడి పందేలకు కోర్టు హైకోర్టు ఉత్తర్వుల్లో ఏమని పేర్కొంది. N Vinay Kumar |v9prajaayudam EDITOR తెలుగు సంప్రదాయాలకు సంక్రాంతి పండగ ఎంతో సందడిగా ఉండే ఈ పండుగ. కొత్త అల్లుళ్లు, రకరకాలు పిండి […]
వచ్చేవారం భారీగా విద్యార్థి సెలవులు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –విద్యార్థులకు హాలిడేస్ అనే పదమే ఎంతో సంతోషాన్నిస్తుంది. అలాంటి స్పెషల్ మూమెంట్ ఈ డిసెంబర్ నెలలో మరోసారి వచ్చింది. ఈ నెల చివరలో క్రిస్మస్ […]
21 న మలికిపురం లో జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు: గొల్లపల్లి
మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో డిసెంబర్ 21 న మలికిపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు మాజీ ముఖ్యమంత్రి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి […]