జంగా జనార్దన రావు చారిటబుల్ ట్రస్ట్ 7వ”వార్షికోత్సవం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జనవరి 23:జేజే రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లోచారిటబుల్ వ్యవస్థాపకులు జంగా రాజేంద్ర కుమార్ అధ్యక్షతన 7వ వార్షికోత్సవాలు నిర్వహించారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఅమలాపురం శివారు చిందాడగరువులో గురువారం అమ్మ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. చారిటబుల్ ఛైర్మన్ జంగా రాజేంద్ర కుమార్ తల్లి జంగా అహల్యబాయ్ ఈ ప్లాంట్ ను నెలకొల్పారు.
బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ కుమార్ మరియు రిపబ్లిక్ పార్టీ జాతీయ నాయకులు డిబిలోక్ పాల్గొని ప్రారంభించారు. ప్రజల అవసరార్థం త్రాగునీరు అందించేందుకు ఈ ప్లాంట్ ను తన తల్లిదండ్రుల గౌరవ వార్థం తన పుట్టినరోజు తో పాటు ఆజాద్ హిందూపౌజు స్థాపించిన సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ప్లాంట్ ను త్రాగునీరు అందని ప్రాంతంలో ప్రారంభించడం పట్ల నల్లా పవన్ తన ప్రసంగంలో రాజేంద్ర కుమార్ ను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి సర్పంచ్ కరాటం ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సభ్యులు యార్లగడ్డ రవీంద్ర ప్రముఖులు ఉయ్యూరు సుబ్రహ్మ ణ్యం రవణం వేణుగోపాలరావు బిజెపి సీనియర్ నాయకులు కర్రీ తాతారావు సీనియర్ జర్నలిస్ట్ రెడ్డి బాబు రిటైర్డ్ డిప్యూటీ తాసిల్దార్ యడ్ల రామచంద్రరావు తాతపూడి గాంధీ (డిఆర్డిఏ) గంటి నరేష్ నాయుడు దేవరపల్లి రాజీవ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

సముద్రం వెంబడి 93 కిలోమీటర్లు మేర రిసార్ట్స్ హోటల్ రెస్టారెంట్లు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం మే 02: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 93 కిలోమీటర్ల పొడవునా సముద్రపు తీరం సుప్రసిద్ధ దేవాల యాలు ఉన్నాయని, […]

లెజెండరీ డాక్టర్ కారెం రవితేజా జన్మదిన శుభాకాంక్షలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ -అమలాపురం జూన్ 22: వైద్య సేవలో అద్భుతమైన ఆరోగ్యం అందించి కరోనా సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కోనసీమ కేర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఎండి డాక్టర్ […]

అక్కడే మకాం వేసిన ఎమ్మెల్సీ ఆశావాహులు. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు 25 మంది పోటీ.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమరావతి మార్చి 09: నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు 25 మంది పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే కోటా ఐదింటిలో ఒక స్థానాన్ని మిత్రపక్షం జనసేనకు […]

పేదలకు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా సామాజిక భద్రత: కలెక్టర్ మహేష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 1: పేదలకు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా సామాజిక భద్రత తోపాటు గౌరవ ప్రద జీవితానికి భరోసా ఏర్పడు తోందని డాక్టర్ […]