పేలుడు ఘటనపై తీవ్ర విషాదం వ్యక్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అయినవిల్లి సెప్టెంబర్ 30:

డా. బి.ఆర్. అంబేద్కర్కోనసీమలో జరిగిన పేలుడు ఘటనపై తీవ్ర విషాదం వ్యక్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

టెక్కలి, సెప్టెంబర్ 30: కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలస దగ్గర కిరాణా దుకాణంలో జరిగిన పేలుడు ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో దంపతులు శ్రీనివాసరావు (50), సీత (48) మృతి చెందడం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం నింపుతూ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ ప్రమాదంలో తీవ్రగాయాలు పొందిన యువకుడుకి మెరుగైన వైద్యం అందచేయాలని అధికారులను ఆదేశించారు. అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి విషాదకర ఘటనలు మరలా జరగకుండా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఇళ్లలో మరియు దుకాణాల్లో పేలుడు పదార్థాలు లేదా ప్రమాదకర వస్తువులను నిల్వచేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.

Related Articles

రామచంద్రపురం నీటి సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

•రామచంద్రపురం నీటి సంఘం అధ్యక్షులుగా బిక్కిన జగన్నాధ రావు.•ఉపాధ్యక్షులుగా పంపన శ్రీనివాసరావురామచంద్రపురం 14 డిసెంబర్ ప్రజా ఆయుధం ::అంబేద్కర్ కోనసీమ జిల్లాడిసెంబర్ 14 వ తేదీ శనివారం రామచంద్రపురం,తోటపేట,వేగాయమ్మ పేట,వెలంపాలెం,వెల్ల నీటి వినియోగ దారుల […]

శ్రామిక హక్కుల పోరాట యోధుడు మచ్చా నాగయ్య

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అయినవిల్లి /అమలాపురం ఆగస్టు 06: కష్టజీవులు శ్రామికుల హక్కులకై పోరాడిన ఉద్యమకారుడు కామ్రేడ్ మచ్చ నాగయ్య అని ఆయన మరణం పేద బడుగు బలహీన వర్గాల […]

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 233 ఫిర్యాదులు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం ఏప్రిల్ 28: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమానికి ఎంతో నమ్మకంతో వచ్చే అర్జీదారుల సమస్యలను తమ సొంత సమస్యలుగా భావించి పరిష్కరిస్తూ […]