సముద్రం వెంబడి 93 కిలోమీటర్లు మేర రిసార్ట్స్ హోటల్ రెస్టారెంట్లు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం మే 02:

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 93 కిలోమీటర్ల పొడవునా సముద్రపు తీరం సుప్రసిద్ధ దేవాల యాలు ఉన్నాయని, తద్వారా దేవాలయ బీచ్ పర్యాటక రంగ అభివృద్ధి చేసి నిర్వహణ కై వివిధ రిసార్ట్స్ హోటల్ రెస్టారెంట్ పెట్టుబడి దారుల ప్రతినిధులను ఆహ్వా నిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నందు కాకినాడకు చెందిన అగామి ఫుడ్స్ హైదరాబాద్ కు చెందినవి హోటల్స్ రిసార్ట్స్, హైదరాబాదుకు చెందిన ఏ ఆర్ ఆర్ బి ఐ గ్రూప్ పెట్టుబడుదారుల ప్రతి నిధులను ఆహ్వానించి జిల్లాలో ఉన్న టూరిజం అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా టూరిజం అధికారి వెంకటా చలం అవగాహనను పెంపొందించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటకాన్ని అభివృద్ధికి ఏజెన్సీలు ముందుకు వస్తే అన్ని విధాలా సహకరించి ప్రణాళికా యుతంగా ఆలయ, బీచ్ సర్క్యూట్ పర్యాటకాన్ని ప్రోత్సహించనున్నట్లు వెల్ల డించారు.ప్రతిపాదిత సర్క్యూట్లో పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాల గురించి ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ చర్చించారు. జిల్లాలో స్వదేశీ దర్శన్ స్కీములో వైనతేయి నదికి దగ్గరగా పాసర్లపూడి, ఆదుర్రు (బౌద్ధ స్తూపం) సముద్ర ముఖ ద్వారం వద్ద అన్ని విధాలుగా అభివృద్ధికి రిసార్ట్స్, రెస్టా రెంట్లు, బోటింగ్ వంటి అవకా శాలు బ్యాక్ వాటర్ తో ఉన్నాయని తెలిపారు. ఎస్.యానాo బీచ్ సముద్ర తీరం రిసార్ట్స్, వాటర్ స్పోర్ట్స్ వంటి అవకాశాల విస్తరణకు మూడు ఎకరాలు విస్తీర్ణంలో భూములు ఉన్నాయన్నారు. అదేవిధంగా కోటిపల్లి గోదావరి తీరంలో ఇప్పటికే నిర్మించిన రిసార్ట్స్ ఉన్నా యని వాటిని పూర్తిగా విని యోగంలో తెచ్చేందుకు అవకాశాలు అపారంగా ఉన్నాయన్నారు. ఆ దిశ గా ప్రతినిధులు సాధ్యసా ద్యాలపై అధ్యయనం చేసి అభివృద్ధికి యోచన చేయా లని సూచించారు. అదే విధంగా ద్రాక్షారామం భీమే శ్వర స్వామి ఆలయం, కోటిపల్లి సోమేశ్వర స్వామి ఆలయం, అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి, ర్యాలీ జగన్మోహన్ స్వామి, వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వంటి మేజర్ దేవాలయాలు 20 మరియు 17 బీచ్ లను సందర్శించేలా ఆలయ, బీచ్ సర్క్యూట్ టూరి జంకు అద్భుతమైన అవకాశాలు జిల్లాలో ఉన్నాయన్నారు. ఇప్పటికే జిల్లాలో దిండి రిసార్ట్స్ దిగ్విజయంగా నడుస్తోందన్నారు. ఆత్రే యపురం మండలం పేరవరం గ్రామంలో పిచ్చుకలంక ద్వీపం, చింతలమోరి బీచ్ లొల్లలాకులు వంటి ప్రక్రియ రమణీయత ఆహ్లాదకరంగా ఉండే సందర్శించాల్సిన అరుదైన ప్రాంతాలు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయన్నారు. తీర ప్రాంతం వెంబడి టీవీ సీరియల్స్ సినీ పరిశ్రమ చిత్రీకరణ జరుగుతుంద ని వారికి ట్రెడిషనల్ గా రిసార్ట్స్, హోటల్స్, స్టే హోమ్స్ నిర్మిస్తే మరింత అభివృద్ధి చెం దేందుకు అవకాశాలు వస్తాయన్నా రు. ఈ ప్రాంతాలన్నీ పర్యావరణ హితoగా కోస్టల్ రీజియన్ జోన్ పరిధికి లోబడి ఉన్నా యని ఆయన స్పష్టం చేశా రు. ఈ పర్యటనలు సాధా రణంగా ఇతివృత్తంతో ఈ సర్క్యూట్లలో పర్యాటకులకు పర్యాటక స్థలాల గురించి ఆ ప్రాంతం యొక్క సంస్కృతి గురించి మరింత సమాచారం అందించడానికి సహాయ పడతాయన్నారు. ఈ సర్క్యూట్లు గ్రామీణ ప్రాంతాల సంస్కృతిని, వివిధ ఆకర్షణ లను ఒకే ప్రయాణంలో చూడటానికి సహాయపడు తుందన్నారు. ప్రభుత్వం తరపున ఇన్వెస్టర్లకు మెరుగైన రాయితీలు కల్పిస్తామన్నారు. టెంపుల్, అడ్వెంచర్, ఎకో, వెల్ నెస్, హెరిటేజ్, రిలీ జియన్, సీప్లేన్ పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా పెట్టుబడి పెట్టేందుకు వచ్చే పెట్టుబ డిదారులకు పెద్ద ఎత్తున మెరుగైన రాయితీల తో ప్రోత్సహించడం జరుగు తుందన్నారు. ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసాని చ్చారు. పర్యాటక రంగంలో విస్తృతమైన అవకాశాలు, వనరులు ఉన్నాయని, వివిధ రకాలుగా పెట్టుబడులు పెట్టేందుకు, ఔత్సాహికులైన ప్రతినిధులను ఆహ్వానిస్తు న్నామన్నారు. పర్యాటకులను ఆకర్షిం చేలా సహజ, సాంస్కృ తిక వారసత్వాన్ని అందిస్తూ ప్రకృతి రమణీయంగా ఆహ్లా దంగా ఎక్కువ రోజులు గడిపేలా మెరుగైన సేవలు, మౌలిక పనతులకు పెద్దపీట వేసేందుకు నూతనంగా ఏర్పడిన కోనసీమ జిల్లా లో కృషి జరగాల్సి ఉందన్నారు. పెట్టుబడి దారులు ముగ్గురు ప్రతినిధులు సమావేశం అనంతరం బీచ్, ఆల యాల సందర్శనకు పర్యాటక రంగ అధికారులతో కలిసి బయ లుదేరి వెళ్లారు. ఈ కార్యక్ర మంలో జిల్లా పర్యాటక ప్రాంతీయ సంచాలకులు సిహెచ్ పవన్ కుమార్ అగామి ఫుడ్ కంపెనీ ప్రతినిధి ఎస్ మూర్తి చిత్తూరీ, ఆర్ వి గ్రూపు ప్రతినిధి ,సతీష్ వెంకటరమణ, వీ రిసార్ట్స్ హోటల్స్ ఎండి సంపత్, జనరల్ మేనేజర్ చంద్ర ప్రకాష్ ,మధు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

విజయవాడలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ లాంఛనంగా శనివారం ప్రారంభించారు.విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ తదుపరి […]

రాజ్యసభలో నేడు ప్రమాణ స్వీకారం

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం. రాజ్యసభలో చేయనున్న ముగ్గురు సభ్యులు బీద మస్తాన్‌ రావు, ఆర్‌.కృష్ణయ్య, సానా సతీష్ ప్రమాణం

పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రోటీన్ టోటల్ మిక్సర్ రేషన్: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం అక్టోబర్ 14: పాడి పరిశ్రమ అభివృద్ధికి పోషక విలువలు కలిగిన ప్రోటీన్ టోటల్ మిక్సర్ రేషన్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి […]