
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 1:

పేదలకు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా సామాజిక భద్రత తోపాటు గౌరవ ప్రద జీవితానికి భరోసా ఏర్పడు తోందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు.

మంగళవారం స్థానిక అమలాపురం పురపాలక సంఘ 25 వ వార్డు 15వ సచివాలయ పరిధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ చేస్తున్న వార్డు సచివాలయ కార్యదర్శు లు ప్రభుత్వ ఉద్యోగులు ద్వారా ఇంటింటికి పింఛన్లు అందిస్తున్న ప్రక్రియను పరిశీలించారు అనంతరం వికలాంగులకు వృద్ధులకు స్వయంగా పింఛన్లను అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లా డుతూ పటిష్ట పర్యవేక్షణ, సమన్వయంతో సజావు గా పెన్షన్ల పంపిణీ జరుగు తోందన్నారు స్వర్ణాంధ్ర @ 2047 దార్శనికతకు అను గుణంగా ప్రత్యేక ప్రణాళికతో పీ4 వంటి వినూత్న విధా నాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

పురపాలక సంఘ పరిధిలో అన్ని కేటగిరీలు కలిపి మొత్తం 4,361 మందికి రూ కోటి 94 లక్షల 72 వేల పంపిణీ చేస్తున్నట్లు తెలి పారు. 25వ వార్డు నందు 193 మందికి రూ 8,51,500 లు కేటగిరీల వారీగా పంపిణీ జరుగుతోందన్నారు లబ్దిదా రులకు పెన్షన్ మొత్తం సరైన విధంగా అందుతుందా లేదా? అనే విషయాన్ని అడిగి తెలు సుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పారద ర్శకంగా, జవాబుదారీ తనం తో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పెన్షన్ల మొత్తా న్ని లబ్దిదారుల ఇళ్ల వద్దే అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమంలో ప్రజల సంతృప్తి స్థాయి మెరుగుపడేలా ప్రభుత్వ సేవలందించేందుకు కృషి చేస్తున్నట్లు వివరిం చారు. పెన్షన్ల పంపిణీపై నిరంతర పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ చేయడం జరుగు తోందని, క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వ యంతో పనిచేసి ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా చూస్తున్నారన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో లబ్దిదారులతో మాట్లాడి పెన్షన్లు అందుకో వడంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా, సమయానికి అందుతోందా? అని అడిగి అభిప్రాయాలు తెలుసు కున్నారు. ఇటీ వల భర్త సామాజిక భద్రతా పింఛను పొందుతూ మరణిస్తే, భార్యకు తదుపరి నెల నుంచే పింఛను అందేలా స్పౌజ్ పింఛన్ కేటగిరీని ప్రవేశ పెట్టారన్నారు.

కొన్ని సంద ర్భాలలో ఒకటో తేదీ సెలవు దినం వస్తే ఒకరోజు ముందు గానే పింఛన్లు పంపిణీ చేస్తు న్నామన్నారు.ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికు లు, మత్స్యకారులు, చర్మకా రులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవీ బాధి తులు, కళాకారులు వంటి సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ఎన్టీ ఆర్ భరోసా అమలు చేయబ డుతోందన్నారు. సచివాలయ ఇతర ఉద్యో గులతో పింఛన్ల పంపిణీని నిర్వహిస్తున్నార న్నారు.లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేస్తు న్నారన్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు నేరుగా పింఛను అందు కోవడం జరుగుతుంద న్నారు. ఒకటో తేదీన ఏదైనా కారణం చేత పింఛను తీసు కోలేని వారికి తదుపరి ఒకటి లేదా రెండు రోజుల్లో మళ్ళీ పంపిణీ చేస్తారని లబ్ధిదారులు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. చెల్లించ ని పింఛన్లకు సంబంధించిన కారణా లను సంక్షేమ సహా యకులు నిరేశిత తేదీలోపు ఆన్లైన్లో నమోదు చేస్తార న్నారు ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పురపా లక సంఘ కమిషనర్ నిర్మల్ కుమార్, డి ఆర్ డి ఏ, పి డి సాయి నాథ్ జయచంద్ర గాంధీ, తదితరులు పాల్గొ న్నారు.