క్రీడోత్సవాలు ఆటలతో ఆరోగ్యం”

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 16:

జనవరి 21, 22 తేదీలలో జిల్లాస్థాయిలో నిర్వ హించ నున్న “కోనసీమ క్రీడోత్సవాలు ఆటలతో ఆరోగ్యం” కార్యక్రమాలను విజయ వంతంగా నిర్వ హించేందుకు పటిష్ట మైన ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వివిధ శాఖల అ ధికారులను ఆదేశించారు గురువారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ లో విద్యాశాఖ, క్రీడా ప్రాధికార సంస్థ, కలెక్టరేట్ అధికారులతో జిల్లాస్థాయి కోనసీమ క్రీడోత్సవాలు ఆటలతో ఆరోగ్యం కార్య క్రమాల సన్నద్ధతపై సమీక్షించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్థాయిలో గెలుపొం దిన 7, 8, 9 తరగతుల క్రీడాకారులకు స్థానిక జి ఎం సి బాల యోగి స్టేడియం నందు జిల్లా స్థాయి క్రీడా పోటీ లను ఈనెల 21, 22 తేదీలలో ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తు న్నట్లు తెలిపారు మండల స్థాయి నుండి సుమారుగా 2,700 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని వారికి అవసరమైన త్రాగునీరు వసతి అల్పాహారం భోజన, మౌలిక వసతు లు కల్పనకై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మూడు డివిజన్ల వారీగా క్రీడా పోటీలు నిర్వ హించి ఫైనల్ కు చేరిన మూడు డివిజన్లు బృందాలు జిల్లా స్థాయిలో పాల్గొంటాయని ఆయన స్పష్టం చేశారు. అథ్లెటిక్స్ గేమ్స్ వాలీబాల్ కబడ్డీ కో కో బాస్కెట్బాల్ బ్యాడ్మింటన్ పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించి ఈనెల 22 వ తేదీ సాయంత్రం విజేతలకు ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు గా మెడల్స్ ప్రశంస పత్రాలు బహుకరించనున్నట్లు తెలిపారు. ఈనెల 21వ తేదీన 22 మండలాలలో గెలుపొందిన బృందాలు క్రీడాంశాలలో పాల్గొంటా రని వీరిలో సెమీఫైనల్కు చెందినవారికి 22వ తేదీన సెమీఫైనల్ ఫైనల్ పోటీలను నిర్వహించి సాయంత్రం బహుమ తుల ప్రధానోత్సవం నిర్వహిస్తారన్నారు స్టేజ్ టెంట్లు, కుర్చీలు, వసతి కొరకు పరుపులు దుప్పట్లు వంటి ఏర్పాట్లను చేప ట్టా లన్నారు. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన బాలి కలు బాలురకు గేములు క్రీడల పోటీలను విడివిడిగా నిర్వహిస్తారన్నారు. మున్సి పల్ అధికారులు పారిశుద్ధ్య ఏర్పాట్లు ట్రాన్స్కో వారు నిరం తరాయంగా విద్యుత్ సరఫ రా ఆర్డబ్ల్యూఎస్ విభాగం త్రాగునీరు ఏర్పాట్లు చేపట్టా లని ఆదేశించారు. క్రీడల నిర్వహణకు అయ్యే అంచనా వ్యయాలను నివేదికను రూపొందించాలని ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి డిఆర్ఓ కే మాధవి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకులు పిఎస్ సురేష్ కుమార్, కలెక్టరేట్ కోఆర్డినే షన్ సెక్షన్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ, పరిపాలనా ధికారి కే కాశీ విశ్వేశ్వరరావు, పంచాయ తీరాజ్ ఎస్ ఇ పి రామకృ ష్ణారెడ్డి స్కూల్ సెక్రటరీ శ్రీనివాస్ పి ఈ టి అసోసి యేషన్ కార్యదర్శి బి వి ఎస్ ఎన్ మూర్తి స్టేడియం కోచ్, భీమేష్ పీఈటీలు గణేష్ , పి రవి తదితరులు పాల్గొన్నారు.