V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జనవరి 08:రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్పీల జనాభా వారి వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహించాలన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఎస్సీ కులగణన వివరాలను తేది 26.12.2024 నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించినారు. దీనిపై అభ్యంతరరాలు స్వీకరించడానికి గడువును జనవరి 12వ తేది వరకు పొడిగించినారు. తరువాత జనవరి 16వ తేది వరకు అభ్యంతరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. సమగ్ర వివరాల సేకరణ అనంతరం జనవరి 20వ తేదిన కులగణన తుది వివరాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఈ మేరకు జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం జి.వొ. ఆర్.టి.నెం. 01, తేది 07.01.2025 ద్వారా మార్గదర్శకాలను విడుదల చేసింది.
మూడు దశలలో తనిఖీ:
పేరు, అధార్ నంబర్, పుట్టిన తేది వయస్సు, ఉపకులం, మరుగుదొడ్డి సౌకర్యం, తాగునీటి సౌకర్యం, విద్యార్హత, వృత్తి వ్యవసాయంఇతర వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఈ డేటా పై అభ్యంతారాలను వీఆర్వో స్వీకరిస్తారు. వీటిని మూడు దశలలో తనిఖీ చేస్తారు. పౌరుల నుంచి వచ్చిన అభ్యంతరాలను వీఆర్వో పరిశీలించి వివరాలను ఆర్ ఐ కి నివేదిస్తారు. వీటిని ఆర్ ఐ పునఃపరిశీలించి తహసీల్దారుకు రికమండ్ చేస్తారు. తర్వాత తహసీల్దార్ వీఆర్వో, ఆర్ ఐ ల నివేదికలో వివరాలను పరిశీలించి, తుది ఆమోదం తెలిపి ఆ వివరాల్ని ఫోర్టల్ లో పొందుపరుస్తారు. పొందు పరిచిన వివరాల్లో కచ్చితత్వాన్ని పెంపొందించెందుకు సహాయ సాంఘిక సంక్షేమ అధికారులతో 50 మంది వివరాన్ని ర్యాండమ్ గా తనిఖీ చేయిస్తారు. ఈ సోషల్ ఆడిట్ ను కలెక్టరు, ఆర్డీవోలు పర్యవేక్షిస్తారు.