
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-ఆత్రేయపురం జనవరి 11:

గోదావరి తీరాన ప్రకృతి రమణీయతతో అలరించే కోనసీమ ప్రాంత సంక్రాంతి సంబ రాలను కేరళ తలపించే మాదిరిగా ఔత్సాహిక క్రీడాకా రులను మరింత ప్రోత్సహించే విధంగా క్రీడా స్ఫూర్తితో ఈత లు పడవల పోటీలు నిర్వ హించడం జరుగుతోoదని స్థానిక పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ పేర్కొన్నారు.

శనివారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ఆత్రేయపురం మండల పరిధిలోని ఆత్రేయపురం వద్ద స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు సారధ్యంలో జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం బొబ్బలంక – అమలాపురం పెద్ద కాలువలో ఈతల పోటీలు పడవల పోటీలను పార్లమెంట్ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరా వు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంత రించిపోతున్న క్రీడలకు పూర్వ వైభవం తీసుకుని రావాలని ఆకాంక్షలకు అను గుణంగా స్థానికంగా ఈ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

ప్రతి ఒక్కరూ క్రీడ పోటీల్లో పాల్గొని క్రీడా ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. రాష్ట్ర ము ఖ్యమంత్రి ఆలోచనకు ఆశయాలకు అనుగుణంగా సనాతన సాంస్కృతి సాంప్ర దాయ క్రీడలను ప్రోత్సహించే దిశగా ఈ పోటీలు నిర్వ హి స్తున్నట్లు ఆయన తెలిపారు. 15 సంవత్స రాలలోపు వయసున్న బాలురు బాలికల విభాగాలలో నిర్వహించిన ఈతల పోటీలను వారి ప్రారంభించారు. అదేవి ధంగా పడవలపోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలురు బాలికలు ఈతల పోటీలలో లక్ష్యాన్ని నిర్దేశించు కుని క్రీడా ప్రతిభను చాటారన్నారు. ఈ పోటీలలో మగ వారి కంటే తామేమి తీసి పోమని మహిళా శక్తిని నిరూపించారన్నారు.

యువత మంచి స్ఫూర్తితో ముందుకు వచ్చి సంక్రాంతి సంబరాలను విజయవంతం చేయడంతో పాటు క్రీడలలో తమ సత్తాను చాటుకు శారీరక దారు డ్యా న్ని మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకో వాలన్నారు మూడు రోజులు పోటీలలో ఉత్సాహంగా పాల్గొనాలని ఈ సందర్భంగా నిర్వాహకులకు ఆయన ధన్యవాదాలు తెలి పారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహే ష్ కుమార్ మాట్లాడుతూ క్రీడా కారులందరూ భద్రతాపరంగా లైఫ్ జాకెట్లు సెక్యూరిటీ పరిక రాలతో క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడల్లో సంబ రాల తోపాటు ఔత్సాహిక క్రీడాకారులను మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అందించడం జరుగుతుందన్నారు. ప్రభు త్వ పరంగా క్రీడల పట్ల మరిం త ప్రోత్సాహాన్ని అందించ డానికి కృషి చేయడం జరు గుతుందన్నారు.

తొలుతగా స్థానిక శాసనసభ్యులు బండారు సత్యా నందరావు క్రీడా పోటీలు నిర్వహణ సంబంధించి పూజాది కార్యక్రమాలు వేద పండితుల మంత్రో చ్ఛరణల నడుమ నిర్వహించి కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్డిఓ పి శ్రీకర్, నీటి వినియోగదారుల సంఘాల డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ కరుటూరి నరసింహారావు, డి రామకృష్ణ ఏ రామకృష్ణ కె వి సత్యనారాయణ రెడ్డి ము దునూరి వెంకటరాజు ఎంపీడీవో వెంకటరమణ తాసిల్దార్ టీవీ రాజేశ్వరరావు ఆర్గనైజర్ దండు శివ తదితరులు పాల్గొన్నారు.
