కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను బలపర్చాలి వి వి వి చౌదరి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ -మండపేట ఫిబ్రవరి 23:ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రులనయోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ వివివి చౌదరి ( కుర్మపురం ఆబ్బు) విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మీడియా తో ఆయన మాట్లాడారు.
వైసీపీ జగన్ రెడ్డి విధ్వంసకర పాలనలో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన నష్టాలను పూడుస్తూ జగన్ రెడ్డి తరిమికొట్టిన పరిశ్రమలను తిరిగి తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమన్నారు.గతంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు మంచి పిఆర్సి ఇచ్చి ప్రోత్సహించిన నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు.నేడు ఉద్యోగ, ఉపాధ్యాయ, సచివాలయ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలు పూర్తి అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరం ఎంతైనా ఉందన్నారు. సమాజం పట్ల అవగాహన, బాధ్యత కలిగిన పట్టభద్రులు అందరూ ప్రగతి పక్షాన నిలిచి, తమ మొదటి ప్రాధాన్యత ఓటు ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీపేరాబత్తుల రాజశేఖర్ కి వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

Related Articles

కొత్తపేటలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ఎంపీ హరీష్ బాలయోగి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – కొత్తపేట జూలై 14: డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామం రెడ్డెప్పవారిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత […]

ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక తవ్వకాలు జరగకూడదు: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 3: జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలు మరియు రవాణాపై ప్రత్యేక తనిఖీలు చేపడుతూ అక్రమంగా ఇసుక తరలింపు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా […]

ఎస్సీ ఎస్టీ నర్సింగ్ మహిళలకు జర్మనీ భాష నందు ఉచిత శిక్షణ:పి జ్యోతిలక్ష్మి దేవి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 26: ఎస్సీ ఎస్టీ నర్సింగ్ మహిళలకు జర్మనీ భాష నందు ఉచిత శిక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని డాక్టర్ […]

కోయంబత్తూరులో కొబ్బరి, క్వాయర్ ఉత్పత్తుల ఎఫ్ ఎక్స్ ఫ్యాక్టరీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 23: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొబ్బరి క్వాయర్ అధ్యయన బృందం శుక్రవారం కోయంబ త్తూరు సమీపంలోని తిరు పూరు […]