
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 28:

సముద్ర తీర ప్రాంత ఆక్వా జోన్ మరియు ఆక్వాయేతర జోన్లలో ఎంత మేర విస్తీర్ణంలో ఆక్వాచెరువులు ఉన్నది జి యో కోఆర్డినేట్స్ మ్యాపులతో సహా బృందాలు సర్వే ఆధారంగా కచ్చితత్వంతో కూడిన నివేదికలను సమ ర్పించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నందు కాలుష్య నియంత్రణ మండలి భూగర్భ జల శాఖ, మత్స్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి కోస్టల్ రీజియన్ జోన్ కోస్తా తీర ప్రాం త మేనేజ్మెంట్ హరిత ట్రిబ్యు నల్ మరియు భూగర్భ జల శాఖ మరియు కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలు ఆచరణ ఆక్వా చెరువుల అనుమ తులు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ..మత్స్య ,రెవెన్యూ ,వ్యవసాయ శాఖల అధికారులతో సర్వే బృందాలు నియమించి ఆక్వా జోన్ ఆక్వాయేతర జోన్లలో ఎంత మేర విస్తీర్ణంలో చెరువులు ద్వారా ఆక్వా సాగు సాగుతున్నది క్షేత్ర స్థాయిలో నిశితముగా పరిశీలించి నివేదికలను రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. అదేవిధంగా సాగులో ఉన్న చెరువులకు అనుమతులు ఉన్నది లేనిది మార్గదర్శకాలు ఆచరిస్తున్నది లేనిది నివేదికలో పొందుప రిచి సమర్పించాలన్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న 46 వేలు ఎకరాలకు, ఆక్వా జోన్లో లేని ఏడు వేల ఎకరాలకు గ్రామ, మండల, డివిజన్ వారీగా ఆక్వాజోనేషన్ టైపును నిర్ధారించాలన్నారు. నూతనంగా వెలువడిన జీవో ఎంఎస్ నెంబర్ 7 ప్రకారం ఆక్వా చెరువుల అనుమ తులను మంజూరు చేయా లని సూచించారు. భూగర్భ జల శాఖ వారి మార్గదర్శ కాలు ప్రకారం పంట కాలువల నదీ పరివాహక జలాలను మాత్రమే ఆక్వా సాగుకు వినియోగించాల్సి ఉందని లేదా ఉప్పు నీటిని, భూగర్భ జలాలను వినియోగిస్తున్నది పరిశీలన చేసి నివేదిక సమర్పించాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి సూత్రాల ప్రకారం పెద్ద పెద్ద ఆక్వా చెరువులకు చుట్టూ సీ పేజ్ డ్రెయిన్లు/గార్ల్యాండ్ డ్రైయిన్లు ద్వారా ఊట నీరు పారే సౌకర్యం ఉన్నది లేనిది పరిశీలించాలన్నారు. సబ్ డివిజనల్ స్థాయి కమిటీ పరిధిలో సంబంధిత డివిజనల్ రెవిన్యూ అధికారి ఐదు హెక్టార్ల లోపు చెరువులకు అనుమతులు మంజూరు చేస్తూ ఐదు హెక్టార్ల విస్తీర్ణం పైబడిన ఆక్వా చెరువుల అనుమతులు మంజూరు కొరకు కోస్టల్ ఆక్వా అధారిటీ విభాగానికి పంపాలన్నారు. కోస్టల్ రీజియన్ జోన్ నిబంధనలు పాటిస్తున్నది లేనిది పర్య వేక్షించాలన్నారు. కోస్టల్ ఆక్వాజోన్ అథారిటీ మార్గదర్శకాలు అనుగుణంగా జియో కోఆర్డినేట్స్ మ్యా పింగ్ , చెరువుల రన్నింగ్ కండిషన్స్ పరిశీలన చేసి వివరాలు క్షుణ్ణంగా రూపొం దించి నివేదికలను సమర్పిం చాలని ఆదేశించారు. హరిత ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా సాగులో ఉన్న చెరువుల రద్దుకు సంబంధించి వైనతేయి నదిని ఆనుకొని ఉన్న గొల్లపాలెం కరవాక, గోగన్నమఠం లలో కొనసాగుతున్న రద్దు చర్యలు వేగవంతం చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్ర మంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి, ఇన్చార్జ్ ఆర్డిఓ కె.మాధవి, జిల్లా మత్స్య శాఖ అధికారి ఎన్.శ్రీనివాసరావు, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజనీర్ శంకర్రావు, జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసు బాబు, భూగర్భ జల శాఖ సహాయ సంచాలకులు శివప్రసాద్, మత్స్య అభివృద్ధి అధి కారులు తదితరులు పాల్గొన్నారు.