ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారిగా (డిఆర్ఓ) కె మాధవి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు వస్తున్నాయి -అమలాపురం ఆగస్టు 01:

జిల్లా రెవెన్యూ, భూపరిపాలనను సమర్థవంతం గా నిర్వహిం చేందుకు రెవిన్యూ సిబ్బంది కీలక భూమిక పోషించాలని స్థానిక ఆర్డిఓ ఇన్చార్జి డిఆర్ఓ కె మాధవి అన్నారు. ఇంచార్జ్ గా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, జిల్లా రెవెన్యూ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నందు వివిధ రెవెన్యూ సెక్షన్ల సూపరింటెండెంట్లు సిబ్బందితో సమావేశం నిర్వహించి వివిధ అంశాల ప్రగతిని సిబ్బంది ఏ ఏ విధులు బాధ్యతలు నిర్వహిస్తున్నది వివరాలు తెలుసుకున్నారు. జిల్లా ప్రభుత్వ పరిపాలన లో రెవెన్యూ వ్యవస్థ చాలా కీలకమైనదని కావున వివిధ రెవెన్యూ సెక్షన్ల అధికారులు విధి నిర్వహణ పట్ల సకాలంలో స్పందించి కేటాయించిన విధులను నిర్దేశిత కాలవ్యవ ధిలో పూర్తి చేయాలన్నారు . జిల్లాలో రెవెన్యూ వ్యవహారా లను పర్యవేక్షించే ప్రధాన బాధ్యత జిల్లా రెవెన్యూ అధికారిదేనని ఆమె అన్నారు రెవెన్యూ పరిపాలన,భూ రికార్డులు నిర్వహణ.ల్యాండ్ రెవెన్యూ నీటి తీరువా పన్నులు వసూలు.తో పాటుగా, పట్టా దారు పుస్తకాలు, ఫిర్యాదుల పరిష్కారం.భూ రీ సర్వే, సరిహద్దుల ఖచ్చితతను నిర్ధారించడం. అసైన్డ్ ల్యాండ్ వ్యవహా రాలు ప్రభుత్వ భూముల కబ్జాల నివారణ. అసైన్డ్ ల్యాండ్ వినియోగంపై పర్యవేక్షణ ఉండాలన్నారు. అనుమతులు మరియు ధృవీకరణలు వారసత్వ ధృవీకరణలు తో పాటుగా
నివాస, కుల ఆదాయ , సర్టిఫికెట్లు జారీ,.ప్రకృతి విపత్తుల సమయంలో సహాయ చర్యలు.నష్టాల అంచనా వేసి నివేదికలు తయారు చేయడం. ముంపు బాధితుల పునరావా సం వంటి పనులు, ప్రత్యేక సంక్షిప్త ఎన్నికల జాబితా తయారీ విధుల పట్ల మరింత బాధ్యతగా పనిచేయాలని సూచించారు. స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించక విదేశాలు వెళ్లి స్థిరపడి కుటుం బాలను పోషించుకోదలచిన వారికి దిక్సూచి మార్గ దర్శకంగా నెలకొల్పిన కోనసీమ వలస దారుల కేంద్రం ద్వారా విదేశాలు వెళ్లే వారికి సౌకర్యవంతం చేసి మార్గ నిర్దేశం చేసేందుకై వలసదారుల కేంద్ర సిబ్బందికి కృషి చేయాలని కేంద్రం నోడల్ అధికారి కె మాధవి సూచిం చారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి కడలి కాశీ విశ్వేశ్వర రావు, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, రెవెన్యూ సిబ్బంది, వికాస జిల్లా మేనేజర్ జి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

కోయంబత్తూరులో కొబ్బరి, క్వాయర్ ఉత్పత్తుల ఎఫ్ ఎక్స్ ఫ్యాక్టరీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 23: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొబ్బరి క్వాయర్ అధ్యయన బృందం శుక్రవారం కోయంబ త్తూరు సమీపంలోని తిరు పూరు […]

సభలో జమిలి బిల్లు ప్రవేశం

లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుమతి వచ్చింది. ఓటింగ్లో ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో 129 వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రవేశపెట్టేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. కాగా, పార్లమెంట్లో […]

అల్లవరం ఏఎస్ఐ జంగా సత్యనారాయణ కు మాతృ వియోగం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం జూలై 04: ఏఎస్ఐ జంగా సత్యనారాయణ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.ఆయన తల్లి జంగా విమల (85) శుక్రవారం ఉదయం అనారోగ్యం కారణం […]

ప్రజాస్వామిక విలువలు కాపాడారు మాజీ ఎమ్మెల్సీ వివివి చౌదరి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట మార్చి 04: రాష్ట్రంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఉమ్మడి కృష్ణ – గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఏ […]