v9 public weapon online news
V9 ప్రజా ఆయుధం ఆన్ లైన్ వార్తలు – పి.గన్నవరం డిసెంబర్ 15: వర్గీకరణకు వ్యతిరేకంగా ఆదివారం గుంటూరు జిల్లా నల్లపాడు లో ఏర్పాటుచేసిన మాల మహానాడు బహిరంగ సభ కు పి. గన్నవరం నియోజకవర్గ కార్యకర్తలు వేలాదిగా తరలి వెళ్లారు. అంబాజీపేట బస్ కాంప్లెక్స్ వద్ద
వైసీపీ రాష్ట్ర నాయకులు నేలపూడి స్టాలిన్ బాబు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసారు. కార్యక్రమ జెండాను ఊపి భారీ ఎత్తున బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల మాల మహానాడు సంఘాలు పాల్గొన్నాయి.నాయకులు పులిదిండి సత్యనారాయణ, మైలే ఆనందరావు, నాగవరపు నాగరాజు,నెల్లి వెంకట రమణ,జల్లి బాలరాజు, విజయారావు,గోసంగి కుమార స్వామి, గోసంగి సత్య నారాయణ పాల్గొన్నారు.