కొనుగోలు చేసిన వస్తువులకు రసీదు తీసుకోవడం మంచిది: జాయింట్ కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 24:

నేటి ఆధునిక కాలం లో వస్తువు, మరియు సేవల వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తువు కు రసీదు తీసుకోకపోవడం వంటి నిర్లిప్తత అవగా హన లేమితో ఎన్నో విధా లుగా మోసపోతున్నారని హక్కుల గురించి స్పష్ట మైన అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిషాoతి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా వినియోగదారుల వ్య వహారాలు ఆహార, పౌరస రఫరాల విభాగం ఆధ్వ ర్యంలో జాతీయ వినియో గదారుల దినోత్సవాన్ని ‘వినియోగదారుల న్యాయ పాలనకు వర్చువల్ విధానం డిజిటల్ సౌలభ్యం’ ఇతివృత్తం ఆధారంగా ఘనంగా నిర్వహించారు. వినియోగదారులు ఐ ఎస్ ఐ సర్టిఫైడ్ మార్కింగ్ ఉన్న వస్తువులనే కొనుగోలు జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. ఆహారం ఔషధాలు విషయంలో గడువు తేదీని తప్పనిస రిగా పరిశీలించుకోవా లన్నారు. ఇటీవల వినియోగదారుల అభిరుచులు ఆలోచ నలను ప్రభావితం చేస్తూ వ్యాపార సంస్థలు మోస పుచ్చుతున్నాయని తగ్గింపు ధరలు ఒకటి కొంటే ఒకటి ఉచితం వంటి మాయలో పడి వినియోగదారుల నష్ట పోతున్నారన్నారు. ప్రతి వినియోగదారుడు కొను గోలు ప్రక్రియలో మేల్కో వాల్సిన అవసరం నేడే ఎంతైనా ఉందన్నారు వ్యాపార సంస్థల్లో జవా బుదారితనం నైతికత లోపించడం వల్ల విని యోగదారులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నా రన్నారు వస్తువులు, సేవల నాణ్యత, సామ ర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం వీటికి సంబం ధించిన సమాచారాన్ని తెలుసుకొనే హక్కును కలిగి ఉండటమే విని యోగదారుల హక్కన్నా రు. వినియోగదారుల ప్రయోజనార్థం, హక్కుల పరిరక్షణ కోసం వినియోగ దారుల హక్కుల పరిరక్ష ణ చట్టాన్ని 1986 డిసెం బర్ 24న అమల్లోకి తె చ్చార న్నారు. ఈ చట్టం ప్రకారం వినియోగదా రులకు హక్కులు సంక్ర మించాయన్నారు డీఎస్ ఓ ఉదయభాస్కర్ మాట్లా డుతూ వినియోగదారుల రక్షణ మానవ ప్రాణాలకు, ఆస్తికి ప్రమాద కారక వస్తువు సేవల నుంచి రక్షణ పొందే హక్కు, అవస రాలు తీర్చడమే కాకుం డా, దీర్ఘకాలం మన్నే వస్తు వులు, సేవలను పొందే హక్కు సమాచారం పొందే హక్కు అవాంఛిత వ్యాపార కార్యకలాపాల నుంచి విని యోగదారు లకు రక్షణ కల్పించేందు కు, వస్తు నాణ్యత, బరు వు, స్వచ్ఛత, గురించి తెలియజేయాలన్నారు. నాణ్యమైన సేవలు పొందే సమాచారాన్ని తెలుసు కునే హక్కు ఉందన్నారు. వస్తువులను, సేవలను ఎంపిక చేసుకునే హక్కు, వివిధ రకాల వస్తువులు, సేవలు పొందేటప్పుడు వాటి మధ్య రేటు తెలుసుకోవడం మంచి దన్నారు. సముచిత రేటులో నాణ్యత,సేవలు పొందడం. ప్రాతినిధ్యం వహించే హక్కు వినియో గదారుల ఆసక్తిని, వారి అవసరాలను సరైన వేదికలు, ఫోరంలలో వినిపించడం. వినియోగ దారుల సంక్షేమార్థం ఏర్పాటుచేసిన వివిధ వేదికలలో ప్రాతినిధ్యం వహించడం. వినియోగ దారుల ఫోరంలో విజ్ఞప్తి చేయడం ద్వారా సేవా లోపాలు, వస్తు లోపాల నుండి పరిహారం పొందే హక్కు, వినియోగదారు లు మోసానికి గురైనప్పు డు ఫోరంలో కేసులు వేసి, తగిన పరిహారాన్ని పొం దడం. వినియోగదారులు నిరంతరం తమ హక్కు లను తెలుసుకుంటూ, తమ జ్ఞానాన్ని పెంచు కోవడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎంతోఅవసరమన్నారు. పలువురు ఫారం నిర్వ హకులు వక్తలు మాట్లా డుతూ నూతన వ్యాపారాభివృద్ధి సంస్కరణల వల్ల ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్లో,ఈ కామర్స్, టెలీ షాపింగ్ విధానంలో వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నారన్నా రు. వినియోగ దారులను తప్పుడు ప్రకటనలు, సం దేశాలతో మోసగించడం పెరిగిపోతున్నదని, దీంతో వినియోగదారుల హక్కు ల రక్షణకోసం కొత్త చట్టా ల ఆవశ్యకత ఏర్ప డింద న్నారు. 1986 నాటి చట్టం స్థానంలో 2019లో మరో చట్టాన్ని రూపొందిం చారని. ఈ చట్టం 2020 సంవత్సరంలో అమ లులోకి వచ్చిందన్నారు. వాణిజ్య వ్యాపారాల్లో పనిచేసేవారు నిర్లక్ష్యంగా, మోస పూరితంగా వ్యవ హరించినప్పుడు తక్కువ సమయంలో అతితక్కువ రుసుముతో, దళారుల ప్రమేయం లేకుండా జిల్లా, రాష్ట్ర, జాతీయ వినియో గదారుల ఫోరాల్ని, కమి షన్లను ఆశ్రయించి వ్యక్తి గతంగా సత్వర న్యాయం పొందే సౌలభ్యం ఉంద న్నారు. సైబర్ నేరాల కారణంగా దానిస్థానంలో కొత్త చట్టాన్ని తెచ్చారని, నూతన వినియోగదారు ల హక్కుల పరిరక్షణ చట్టంపై సమగ్ర అవగా హన కల్పించేందుకు పాఠశాల స్థాయి నుంచి, వినియోగ దారుల విద్య, చట్టం ప్రాధాన్యం, అమ లుపై గురించి అవగాహన కల్పించాలన్నారు. జిల్లా తూనికలు కొలతలు శాఖ సహాయ నియంత్రణ అధికారి రాజేష్ మాట్లా డుతూ మానవుని జీవనశైలి ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు తూనికలు కొలతలతో పెనవేసుకుని ఉంటుందని ఉదయాన్నే లేచిన వెంటనే పాలు కొలత లుతో ఆరంభమవు తుందని తెలిపారు మనిషి పుట్టుకతో ఆడ, మగ అనే లింగ నిర్ధారణ తో పాటు శిశువు బరువు తూనికలతో ప్రారంభమై చనిపోయేటప్పుడు ఆరు అడుగుల స్థలం అనే కొలతతో ముగియడం జరుగుతుం దన్నారు. వ్యాసరచన వక్తృత్వపు పోటీలను గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు నగదు మరియు ప్రశంసా పత్రాలతో ఘనంగా సత్క రించారు ఈ కార్యక్రమం లో అద్దంకి అమరేశ్వర రావు, ఎం శ్రీనివాస్ నరేష్, బి వి జి సత్యనా రాయణ, జిల్లా మేనేజర్ పవర్ సారఫరాల శాఖ బాల సరస్వతి సహాయ మేనేజర్ నాగేశ్వరరావు విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Related Articles

కొబ్బరి లో కోకో అంతర్ పంటగా సాగు బహు ప్రయోజనకరం: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -పి గన్నవరం ఫిబ్రవరి 06: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో కొబ్బరి లో కోకో అంతర్ పంటగా సాగు చేస్తూ కోనసీమ […]

ముమ్మిడివరం నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం, మే 26: హెలికాప్టర్ ల్యాండింగ్ కొరకు హెలిప్యాడ్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ నేతృత్వంలోని అధికారుల బృందం తొలుతగా పరిశీలించింది. […]

మండపేట లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట ఫిబ్రవరి 23: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండపేట శ్రీ బాలాజీ లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన […]

ఇళ్ళ విలాస్ కు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – పి.గన్నవరం ఏప్రిల్ 23: ఇళ్ళ విలాస్ కు బుధవారం రాష్ట్ర కార్మిక సంక్షేమం ఫ్యాక్టరీలు మరియు బాయిలర్లు కార్మిక ఆరోగ్య భీమా సేవలు […]